AR Rahman: 29 ఏళ్ల బంధానికి ముగింపు.. ఏ ఆర్ రెహమాన్ విడాకులు

AR Rahman: సినిమా ఇండస్ట్రీలో విడాకుల పరంపర కొనసాగుతుంది. ఒక నెలలో తెలుగు స్టార్ విడాకులు అనౌన్స్ చేస్తే మరొక నెలలో తమిళ స్టార్ మరొక నెలలో బాలీవుడ్ స్టార్ ఇలా చాలా మంది విడాకులు తీసుకుంటున్నారు. దీంతో ఈ విషయం తెలుసుకున్న అభిమానులు ఆశ్చర్యానికి గురవుతున్నారు.తాజాగా, సినిమా ఇండస్ట్రీలో మరో జంట విడాకులు తీసుకుంది. ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహమాన్, సైరా భాను విడిపోయినట్లు వారి లాయర్ వందనా షా అధికారికంగా ప్రకటించారు.

 AR Rahman: ఏఆర్ రెహమాన్ ‘X’ ద్వారా విడాకులపై స్పందిస్తూ ఓ ఎమోషనల్ ట్వీట్ పెట్టారు. ‘‘మా వైవాహిక బంధం త్వరలోనే 30 ఏళ్లకు చేరుతుందని సంతోషించాం. అయితే అనుకోని విధంగా ముగింపు పలకాల్సి వచ్చింది. పగిలిన హృదయాలు దేవుడిని సైతం ప్రభావితం చేస్తాయి. కానీ పలిగిన ముక్కలు మళ్లీ యథావిధిగా అతుక్కోలేవు. అయినప్పటికీ మా దారుల్లో అర్థాన్ని వెతుక్కుంటాం.ఇలాంటి కఠిన పరిస్థితుల్లో స్నేహితులు మా వ్యక్తిగత గోప్యతను అర్థం చేసుకుంటారని భావిస్తున్నాం’’ అని రాసుకొచ్చారు.

కాగా, రెహమాన్, సైరా భాను 1995లో పెళ్లి చేసుకున్నారు. వీరికి ఖతీజా, రహీమ్, అమీన్ ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. అయితే ఈ జంటకు వివాహం జరిగి 29 ఏళ్లు పూర్తి కావొస్తోంది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *