Sabarimala: కేరళలో శబరిమలకు వెళ్లే అయ్యప్ప యాత్రికులను ఆదుకునేందుకు స్థానిక రవాణా శాఖ ముందుకొచ్చింది. శబరిమల తీర్థయాత్ర సమయంలో, మార్గంలో ఏదైనా వాహనం పాడైపోయినా లేదా మరేదైనా అత్యవసర పరిస్థితుల్లో సహాయం చేయడానికి స్థానిక రవాణా శాఖ సిద్ధంగా ఉంది. దీని కోసం, యాత్రీకులు 24 గంటల హెల్ప్‌లైన్ నంబర్‌లను సంప్రదించవచ్చు. ఇలౌంగల్ – 94000 44991, 95623 18181, ఎరుమేలి – 94963 67974, 85476 39173, కుటికానం – 94460 37100, 385100, 385176 వద్ద ఉన్న ప్రాంతీయ రవాణా శాఖ కంట్రోల్ రూమ్‌లకు కాల్ చేయవచ్చు.
అన్ని ప్రధాన ఆటోమేకర్ల నుండి సహాయకులు, క్రేన్లు, అంబులెన్స్‌లు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాయి. ఈ యాత్రను సురక్షితంగా.. టెన్షన్ లేకుండా పూర్తి చేసుకునేందుకు అవసరమైనప్పడు భక్తులు ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవచ్చు.
ఇది కూడా చదవండి: Sabarimala: ప్రారంభమైన శబరిమల అయ్యప్ప దర్శన భాగ్యం