Kailash Gehlot: ఆమ్ ఆద్మీ పార్టీకి, ఢిల్లీ ప్రభుత్వ క్యాబినెట్ మంత్రి పదవికి రాజీనామా చేసిన 24 గంటల తర్వాత కైలాష్ గెహ్లాట్ సోమవారం బిజెపిలో చేరారు. ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్‌దేవా ఆయనకు పార్టీ సభ్యత్వం ఇచ్చారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్ కూడా ఉన్నారు.
బీజేపీలో చేరిన తర్వాత కైలాష్ గెహ్లాట్ మాట్లాడుతూ- ‘ఈ నిర్ణయం రాత్రికి రాత్రే తీసుకున్నారని ప్రజలు అనుకుంటున్నారు. ఎవరి వత్తిడితోనో ఈ నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. నా జీవితంలో ఎప్పుడూ ఒత్తిడికి లోనై ఏమీ చేయలేదని స్పష్టం చేశారు. ఇడి, సిబిఐ ఒత్తిడి మేరకే కైలాష్ పార్టీ మారుతున్నారని ఆప్ ఆరోపించిన సంగతి తెలిసిందే.
ఇది కూడా చదవండి: Anmol Bishnoi: గ్యాంగ్‌స్టర్ లారెన్స్ సోదరుడు అన్మోల్ అరెస్ట్
Kailash Gehlot: తాను న్యాయవాద వృత్తిని వదలి ఆప్ లో చేరానని గెహ్లాట్ చెప్పారు. అన్నా హజారే స్ఫూర్తితో.. ప్రజలకు మేలు చేయాలనే లక్ష్యంతో అప్పట్లో ఆప్ పార్టీలో చేరానన్నారు. అయితే, పార్టీలో చేరిన తరువాత నుంచి నైతిక విలువల విషయంలో రాజీపడడం చూస్తుంటే బాధ కలుగుతోందని ఆయన అన్నారు. ఇది తన ఒక్కడి బాధ కాదనీ, వేల లక్షల మంది కార్మికుల ఆవేదన అనీ చెప్పారు.