Janhvi Kapoor

Janhvi Kapoor: దేవర మూవీలో జాన్వీ కపూర్ ఉందా? లేదా?

Janhvi Kapoor: టైటిల్ చూసి ఏంటీ ఇలా పిచ్చ పిచ్చ టైటిల్స్ అనుకుంటున్నారా? అది మా ప్రశ్న కాదు సినిమా చూసిన ప్రేక్షకులు అనుకుంటున్న మాట. ఎన్టీఆర్ దేవర సినిమా ఎనౌన్స్ చేసిన దగ్గర నుంచి అందులో అందాల తార శ్రీదేవి తనయ జాన్వీ కపూర్ తొలిసారిగా తెలుగులో ఎంట్రీ ఇస్తుందని తెలిసినప్పటి నుంచి.. ప్రేక్షకులు ఆమెను తెలుగు సినిమాలో చూడటం కోసం ఉవ్విళూరారు అనడంలో అతిశయోక్తి ఏమీ లేదు.  పైగా దేవర సినిమా కోసం తాను హిందీలో వచ్చిన పెద్ద అవకాశాలను కూడా వదులుకున్నానని జాన్వీ స్వయంగా చెప్పింది. దేవర సినిమాలో అద్భుతమైన పాత్ర తనది అని చెప్పింది. దీంతో ప్రేక్షకులు దేవర సినిమాలో జాన్వీని చూడటం కోసం మానసికంగా బలంగా ఫిక్స్ అయిపోయారు. ఆమె సినిమాలో కీ రోల్ లో చేసి ఉంటుందని అందరూ భావించారు. 

Janhvi Kapoor: అయితే, దేవర సినిమా ఈరోజు అంటే సెప్టెంబర్ 27న థియేటర్లలో గ్రాండ్ గా రిలీజ్ అయింది. ఎన్టీఆర్ ను చూడాలని ఎంతగా అభిమానులు సినిమా చూడటానికి వెళ్లారో.. అదేస్థాయిలో జాన్వీ కపూర్ ను చూడాలని కూడా అనుకున్నారు. పైగా ఎన్టీఆర్, జాన్వీ జంటగా వచ్చిన ట్రైలర్స్, పాటలు అందరినీ మరింత ఉత్సాహాన్ని నింపాయి. ఇద్దరినీ కలిపి వెండి తెర మీద చూడాలని ప్రేక్షకులు చూపించిన ఉత్సాహం పై సినిమా నీళ్లు చల్లింది. ఎంతలా అంటే.. టైటిల్ లో చెప్పినట్టు జాన్వీ కపూర్ ఈసినిమాలో ఉందా లేదా అని చర్చించుకునేంతగా. 

Also Read: దేవ..రా! NTR సినిమా ఇది!! 

Janhvi Kapoor: సినిమాలో జాన్వీ కపూర్ చాలా కొద్దిసేపు మాత్రమే కనిపించింది. ఎన్టీఆర్ తో ఒక పాటల్లోనూ.. కొన్ని సన్నివేశాల్లోనూ మాత్రమే జాన్వీ కనిపిస్తుంది. దీంతో జాన్వీని చూడాలని.. ఎన్టీఆర్-జాన్వీ జంట చేసే మ్యాజిక్ చూడాలని థియేటర్లకు వెళ్లిన ప్రేక్షకులు నీరసించి పోయారని చెప్పాలి. సినిమా చూసి బయటకు వచ్చిన ప్రతి ప్రేక్షకుడు జాన్వీ సన్నివేశాలు తక్కువగా ఉండడం పట్ల చాలా నిరుత్సాహాన్ని వ్యక్తం చేస్తున్నారు. 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *