Hyderabad: హైద‌రాబాద్‌లో ఐటీ రైడ్స్‌

Hyderabad: హైద‌రాబాద్ న‌గ‌రంలో మూడుచోట్ల ఆదాయ‌పు ప‌న్ను శాఖ అధికారులు సోమ‌వారం దాడులు చేశారు. ఉద‌యం నుంచి ఏక‌కాలంలో మూడుచోట్ల ఈ దాడులు చేశారు. ఇటీవ‌ల జ‌రిగిన విలువైన భూమి అమ్మ‌కానికి సంబంధించిన సొమ్మును లెక్క‌ల్లో చూప‌క‌పోవ‌డంతోనే న‌గరానికి చెందిన ప్ర‌ముఖ రియ‌ల్ ఎస్టేట్ కంపెనీ గ్రూప్ కార్యాల‌యంలో అధికారులు ఈ త‌నిఖీలు చేప‌ట్టారని స‌మాచారం.

Hyderabad: షాద్‌న‌గ‌ర్ ప్రాంతంలో రూ.300 కోట్ల విలువైన భూమిని మ‌ల్టీ నేష‌న‌ల్ కంపెనీకి అమ్మింది. అయితే ఈ లావాదేవీల‌కు సంబంధించిన సొమ్మును ఆ రియ‌ల్ ఎస్టేట్ సంస్థ త‌న బ్యాలెన్స్ షీట్‌లో చూపించ‌లేదు. ఈ ఆరోప‌ణ‌ల నేప‌థ్యంలో ఐటీ అధికారులు నేడు ఆ రియ‌ల్ ఎస్టేట్ సంస్థ యాజ‌మానులైన ఇద్ద‌రి ఇండ్ల‌ల్లో ఈ దాడులు చేశారు. హైద‌రాబాద్ బంజారాహిల్స్‌, షాద్‌న‌గ‌ర్‌, చేవెళ్ల‌లోని వారిండ్లు, కార్యాల‌యాల్లో ఈ త‌నిఖీలు చేప‌ట్టార‌ని స‌మాచారం.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *