Vaarasatwam

Vaarasatwam: 60 ఏళ్ల ‘వారసత్వం’!

Vaarasatwam: నటరత్న యన్టీఆర్, అంజలీదేవి జంటగా నటించిన ‘వారసత్వం’ చిత్రాన్ని మంగళంపల్లి బ్రదర్స్ నిర్మించారు. తాపీ చాణక్య దర్శకత్వంలో రూపొందిన ‘వారసత్వం’ 1964 నవంబర్ 19న విడుదలయింది. వారసులు లేని ఓ కోటీశ్వరుని ఆస్తిని కాజేయాలని దూరపు బంధువు పథకం వేస్తాడు. అయితే అనూహ్యంగా అతనికి ఓ వారసుడు కలసి వస్తాడు. వారికి బాబు పుట్టడం, ఆ పసివాడిని అంతమొందించాలని పలువురు ప్రయత్నించడం, చివరకు హీరో ఆ బాబును కాపాడడం జరుగుతుంది. అందువల్ల అతని ప్రేయసి అనుమానిస్తుంది. ఇలా సాగిన కథ చివరకు బాబు కన్నతల్లి దగ్గరకు చేరుకుంటాడు. ఆమె కూడా ఆ బాబు ఆలనాపాలనా హీరో, హీరోయిన్ కే అప్పచెప్పడంతో కథ సుఖాంతమవుతుంది. ఈ చిత్రం మంచి విజయం సాధించింది. రిపీట్ రన్స్ లోనూ ఆదరణ చూరగొంది. ఈ చిత్రానికి ఘంటసాల సంగీతం ఓ ఎస్సెట్.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Delhi Assembly Elections 2025: తెలంగాణ కేసీఆర్‌.. ఢిల్లీలో కేజ్రీవాల్‌.. ఓట‌మికి ఇదే కార‌ణ‌మా?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *