Ganja: కారులో స్పీడ్‌గా వెళ్తున్నారు. సడెన్‌గా ఆ కారు అదుపుతప్పి రోడ్డు పక్కకు దిగబడిపోయింది. అందులో ఉన్నవారు వెంటనే కిందికి దిగి కారును బయటకు తీసే ప్రయత్నం చేశారు. కానీ రాలేదు. దీంతో వారు అక్కడ నుంచి పరారయ్యారు.అదేంటి రోడ్డు పక్కకు దిగబడిపోయిన కారు రాకపోతే.. స్థానికంగా ఉండే వారిని పిలిచి సహాయం అడగొచ్చు కదా?.. పారిపోవడం ఎందుకు? అనే ప్రశ్న మీలో రావచ్చు. అయితే వారు పారిపోవడానికి ఓ కారణం ఉంది. అదేంటో ఇప్పుడు చూద్దాం.
అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు మండలం చింతలవీధి నుండి పెదబాయలు వైపు ఆ కారు స్పీడ్‌గా వెళుతుంది. ఈ క్రమంలో ఆ కారు అదుపుతప్పి చింతలవీధి గ్రామంలోని రోడ్డు పక్కన ఒక రేకుల ఇంట్లోకి దూసుకెళ్లి గుంతలో దిగబడింది. దీంతో అందులో ఉన్నవారు ఎంత ప్రయత్నించినా బయటకు తీయలేకపోయారు. దీంతో వారు అక్కడ నుంచి పరారయ్యారు.
Ganja: దీంతో సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆపై కారులో పరిశీలించగా.. అందులో పెద్ద మొత్తంలో గంజాయి ఉన్నట్లు గుర్తించారు. దాన్ని బయటకు తీసి బరువు చూడగా.. దాదాపు 538 కేజీల గంజాయి రవాణా చేస్తున్నట్లు సీఐ దీనబంధు పేర్కొన్నారు.
ఆపై కారుతో పాటు గంజాయిని పాడేరు పోలీస్ స్టేషన్‌కు తరిలించినట్లు తెలిపారు. అయితే పట్టుబడిన ఆ గంజాయి విలువ సుమారు రూ.27 లక్షల వరకు ఉంటుందని పోలీసులు పేర్కొన్నారు. కారులో వచ్చిన వ్యక్తుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.