Lucky Coupons: మధ్యప్రదేశ్ లో నాలుగేళ్ల బాలుడు 53లక్షల విలువ చేసే లగ్జరీకారు గెలుపొంది స్థానికంగా లక్కీ బాయ్ గా గుర్తింపు పొందాడు. బురాన్ పుర్ కు చెందిన కిరణ్ గర్బా మహోత్సవ్ సందర్భంగా మనువడు మేధాన్ష్ పేరుతో 201 రూపాయలకు ఓ కూపన్ కొనుగోలు చేశాడు. దాదాపు 50వేల మంది లక్కీ కూపన్లు కొనుగోలు చేశారు. దసరా నవరాత్రి వేడుకల తర్వాత లక్కీడ్రా తీయగా నాలుగేళ్ల మేధాన్ష్ 53లక్షల విలువ చేసే టయోటా ఫార్చునర్ కారు గెలుపొందాడు. దీంతో ఆ బాలుడి కుటుంబం ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.
ఇది కూడా చదవండి: Harish Rao: మహిదీపట్నం నుంచి బస్‌భవన్‌కు బయల్దేరిన హరీష్‌రావు
కారు బొమ్మలంటే ఎంతో ఇష్టపడే నాలుగేళ్ల మేధాన్ష్ ….. లక్కీడ్రాలో ఏకంగా టయోటా ఫార్చునర్ కారు గెలుపొందటంపై బాలుడి నానమ్మ సంతోషం వ్యక్తంచేశారు. మేధాంష్ పుట్టినప్పటి నుండి అదృష్టవంతుడని నిరూపించుకున్నాడని ఆమె వివరించింది. “అతను అందరికీ ఇష్టమైన వ్యక్తి, మరియు కుటుంబ సభ్యులు అతన్ని అదృష్టవంతుడిగా భావిస్తారు. అందుకే ప్రతి చిన్న, పెద్ద వస్తువును అతని పేరుతో కొనుగోలు చేస్తారు. స్థానికులు కూడా అతన్ని లక్కీ బాయ్ అని పిలుస్తారని ఆమె తెలిపింది. లక్కీ డ్రాలు సాధారణంగా సామాజిక, సాంస్కృతిక లేదా వినోద కార్యక్రమాల సమయంలో జరుగుతాయి. మధ్యప్రదేశ్‌లో వీటిని నిషేధించరు. 1990లలో, అక్రమ జూదం పెరుగుదలను అరికట్టడానికి మధ్యప్రదేశ్ లాటరీలను ప్రవేశపెట్టింది. అయితే, విస్తృత విమర్శలు, వివాదాల కారణంగా, దీనిని ఒక ఆర్డినెన్స్ ద్వారా పూర్తిగా నిషేధించారు.