TG Govt Schemes: తెలంగాణ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అముచేయడానికి సిద్ధం అయింది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా నేటి నుంచి నాలుగు ముఖ్యమైన పథకాలను అమలుచేయనున్నారు. రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డుల పథకాలను నేడు ప్రారంభించనున్నారు.
ఈమేరకు తెలంగాణ వ్యాప్తంగా ఉన్న 606 గ్రామాల్లో లాంఛనంగా ఈ నాలుగు స్కీంలకు మధ్యాహ్నం 1 గంటకు ఈ పథకాలను ఒకేసారి ప్రారంభించనున్నారు. మిగిలిన ప్రాంతాల్లో ఫిబ్రవరి 1 నుండి మార్చి 31 మధ్య రాష్ట్రం మొత్తం కవర్ చేయనున్నారు.
కాగా.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నారాయణపేట జిల్లాలోని చంద్రవంచలో ఈ పథకాలను అధికారికంగా ప్రారంభించనున్నారు.