Indrudu Chandrudu: పరిస్థితులు కొన్నిసార్లు మంచివారిని చెడ్డవారిగా, నీచులను నీతిమంతులుగా నిలుపుతాయని అంటారు. జనం దృష్టిలో నీచునిగా నిలచిన మేయర్ నాయుడును అతను చచ్చాక నీతిమంతునిగా నిలుపుతాడు ఓ యువకుడు… నాయుడు చెడ్డవాడైనా, అతని కుటుంబం కోసం, జనానికి మంచి జరగాలని హీరో అలా చేస్తాడు… ఈ కథతో రూపొందిన చిత్రమే ‘ఇంద్రుడు-చంద్రుడు’… ‘మూన్ ఓవర్ పారడార్’ ఆంగ్ల చిత్రం స్ఫూర్తితో ఈ సినిమా రూపొందింది… సురేశ్ కృష్ణ దర్శకత్వంలో డి.రామానాయుడు నిర్మించిన ఈ చిత్రం 1989 నవంబర్ 24న విడుదలయింది. విజయశాంతి నాయికగా నటించిన ఈ సినిమాకు ఇళయరాజా స్వరకల్పన ఓ ఎస్సెట్ గా నిలచింది. కమల్ హాసన్ కు ఉత్తమ నటునిగా నంది అవార్డు లభించింది… తెలుగునాట విజయం సాధించిన ఈ చిత్రాన్ని తరువాత తమిళంలో ‘ఇందిరన్ చందిరన్’గానూ, హిందీలో ‘మేయర్ నాయుడు’గా అనువదించి రిలీజ్ చేశారు. అక్కడా మంచి ఆదరణ చూరగొంది.