Sambaiah

Sambaiah: పాతికేళ్ళ ‘సాంబయ్య’

Sambaiah: అంతకు ముందు ‘పోలీస్, దేవా’ చిత్రాలతో హీరోగా తనకంటూ ఓ ప్రత్యేక స్థానం సంపాదించారు శ్రీహరి… ఆ తరువాత శ్రీహరి హీరోగా తెరకెక్కిన చిత్రం ‘సాంబయ్య’… శ్రీహరి హీరోగా తెరకెక్కిన తొలి రెండు చిత్రాలకు దర్శకత్వం వహించిన కె.యస్.నాగేశ్వరరావు డైరెక్షన్ లోనే ‘సాంబయ్య’ రూపొందింది… శ్రీసాయి గణేశ్ ప్రొడక్షన్స్ పతాకంపై ఈ చిత్రాన్ని బెల్లంకొండ సురేశ్ నిర్మించారు… ఈ సినిమాతోనే బెల్లంకొండ సురేశ్ నిర్మాతగా మారారు… 1999 నవంబర్ 26న విడుదలైన ‘సాంబయ్య’ మంచి విజయం సాధించింది… ఆ తరువాత నిర్మాతగా బెల్లంకొండ సురేశ్ తనదైన బాణీ పలికిస్తూ స్టార్ హీరోస్ బాలకృష్ణ, రాజశేఖర్, రవితేజ, జూనియర్ యన్టీఆర్ తో సినిమాలు తీస్తూ సక్సెస్ చూశారు… ఈ నాటికీ బెల్లంకొండ సురేశ్ అనగానే ఆయన నిర్మించిన తొలి చిత్రం ‘సాంబయ్య’నే గుర్తు చేసుకుంటారు సినీజనం…. మదర్ సెంటిమెంట్ తో రూపొందిన ఈ చిత్ర విజయం తరువాత శ్రీహరి సైతం హీరోగా వరుస చిత్రాలతో సాగారు… వందేమాతరం శ్రీనివాస్ ఈ చిత్రానికి సంగీతం సమకూర్చారు…

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Horoscope: నేటి రాశి ఫలాలు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *