Bathukamma Guinness Record: తెలంగాణ ఆత్మగా నిలిచిన బతుకమ్మ పండుగకు అరుదైన గౌరవం దక్కింది. హైదరాబాద్‌లోని సరూర్‌నగర్ మున్సిపల్ స్టేడియంలో సోమవారం సాయంత్రం రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జరుగుతున్న గ్రాండ్ వేడుకల్లో రెండు గిన్నిస్ వరల్డ్ రికార్డులు నమోదయ్యాయి.
మెగా బతుకమ్మతో రికార్డు
ఈ సందర్భంగా మైదానంలో ఏర్పాటు చేసిన 63 అడుగుల (కొన్ని వివరాల ప్రకారం 66.5 అడుగుల) భారీ బతుకమ్మ గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించింది. ఇది ప్రపంచంలోనే అతి పెద్ద బతుకమ్మగా గుర్తింపు పొందింది.
ఇది కూడా చదవండి: SURE Water Bottle: 5 రూపాయలకే వాటర్ బాటిల్… కొత్త వ్యాపారం మొదలుపెట్టిన రిలయన్స్
10 వేల మంది మహిళలు ఈ బతుకమ్మ వేడుకలో పాల్గొన్నారు. ఈ బతుకమ్మ మహోత్సవంలో మంత్రులు సీతక్క, కొండా సురేఖతో పాటు అనేక మంది మహిళా ప్రజాప్రతినిధులు హాజరుకానున్నారు.