Mr & Mrs Sailaja Krishnamurthy: తన చిత్రాలలో కామెడీని సందర్భోచితంగా చొప్పించి ఆకట్టుకున్నారు శివ నాగేశ్వరరావు. ఆయన తెరకెక్కించిన ‘మిస్టర్ అండ్ మిసెస్ శైలజా కృష్ణమూర్తి’ సైతం అదే తీరున సాగింది. 2004 అక్టోబర్ 22న విడుదలైన ‘మిస్టర్ అండ్ మిసెస్ శైలజా కృష్ణమూర్తి’ నవ్వులు పూయిస్తూ ఆకట్టుకుంది. ఇందులో హీరో నాస్తికుడు – హీరోయిన్ పరమ భక్తురాలు- వారిద్దరూ అన్నవరం పోతూ ట్రైన్ లో కలుసుకుంటారు. ఆరంభంలో కీచులాటలు, పరిచయాలు పెరగడం, తరువాత ఒకరినొకరు మిస్ కావడం జరుగుతాయి. చివరకు శైలజ, కృష్ణమూర్తి కలుసుకొని తమ మనసులోని మాట చెప్పుకోవడంతో కథ ముగుస్తుంది. ఈ చిత్రాన్ని అట్లూరి పూర్ణచంద్రరావు నిర్మించారు. ఇందులో శైలజగా లైలా, కృష్ణమూర్తిగా శివాజీ నటించారు. ఈ చిత్రానికి రోహిత్ రాజ్ సంగీతం సమకూర్చారు. కామెడీ లవర్స్ ను ఈ సినిమా ఆకట్టుకుంది…

