Honey

Honey: తేనె పేరుతో మోసం.. మీరూ కొంటున్నారా ఈ ‘ఫేక్ హనీ’ని?

Honey: తేనె… ఆరోగ్యానికి చాలా మంచిది. అందుకే ఇప్పుడు చాలా మంది పంచదారకు బదులుగా తేనె వాడుతున్నారు. పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకూ అందరూ దీన్ని ఇష్టపడుతున్నారు. అయితే, మనం ఇంతగా నమ్ముతున్న తేనె ఎంత వరకు నిజమైనది?

నిజం చెప్పాలంటే, మార్కెట్లో దొరుకుతున్న తేనెలో దాదాపు 90 శాతం కల్తీదే అంటున్నారు నిపుణులు. ఇలాంటి కల్తీ రాయుళ్లు చేసే మోసం తాజాగా భాగ్యనగరంలో బయటపడింది.

హైదరాబాద్‌లో కల్తీ దందా బట్టబయలు!
హైదరాబాద్‌లోని ఓల్డ్‌సిటీలో ఈ కల్తీ తేనె దందాకు కళ్లెం పడింది. కంచన్‌బాగ్‌ పోలీసులు బాబానగర్‌లోని ఓ ఇంటిపై మెరుపు దాడి చేసి భారీగా నిల్వ చేసిన నకిలీ తేనెను పట్టుకున్నారు.

అక్టోబర్ 16 గురువారం నాడు జరిగిన ఈ ఆపరేషన్‌లో సుమారు 100 కిలోల కల్తీ తేనెను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అంతేకాదు, ఒక వ్యక్తిని అరెస్టు చేశారు. నిందితులు చాలా కాలంగా రోడ్డు పక్కన బకెట్లలో ఈ తేనెను అమ్ముతూ అమాయక ప్రజలను మోసం చేస్తున్నారని పోలీసులు తెలిపారు.

Also Read: Rammohan Naidu: గూగుల్ పెట్టుబడి.. ఏపీ చరిత్రలో చారిత్రక ఘట్టం

ఎలా తయారు చేస్తున్నారు?
ఆరోగ్యం కోసం కొనే తేనెలో వీరు కలిపే పదార్థాలు తెలిస్తే షాక్ అవుతారు. ఈ కేటుగాళ్లు బెల్లం, నీళ్లు, కొన్ని రకాల కెమికల్స్‌ కలిపి అచ్చం తేనెలాగే ఉండే నకిలీ తేనెను తయారు చేస్తున్నారు. దీనికి బ్రాండెడ్ కంపెనీల లేబుల్స్ అతికించి మార్కెట్లో అమ్ముతున్నారు. రంగు, రుచి తేడా తెలియకపోవడంతో ప్రజలు సులభంగా మోసపోతున్నారు. ఈ దందా గత 10-15 సంవత్సరాలుగా నడుస్తోందని తేలింది.

మనం తెలుసుకోవాల్సింది ఏంటి?
* తేనె ఎంత అవసరం?: మన దేశ జనాభాకు అవసరమైనంత స్వచ్ఛమైన తేనె ఉత్పత్తి అవుతుందా? నిజంగా అంత తేనె దొరకడం కష్టమే.

* బ్రాండ్ చూసి మోసపోవద్దు: పెద్ద పెద్ద బ్రాండ్లు, అందమైన లేబుల్స్ చూసి వెంటనే నమ్మేయకండి.

* జాగ్రత్త పడాలి: కల్తీ తేనె తినడం వల్ల ఆరోగ్యానికి మేలు జరగకపోగా, లేనిపోని సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది.

పోలీసులు ఈ రాకెట్ వెనుక ఉన్న మిగతా వ్యక్తుల కోసం దర్యాప్తు చేస్తున్నారు. ప్యూర్‌ హనీ పేరుతో అమ్ముతున్న కల్తీ తేనె బారిన పడకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *