Google: టెక్ ప్రపంచంలో మరో మైలురాయిని దాటింది గూగుల్ మాతృ సంస్థ ఆల్ఫాబెట్. కంపెనీ చరిత్రలో ఇదే మొదటిసారి — ఒక్క త్రైమాసికంలోనే $100 బిలియన్ (₹8.80 లక్షల కోట్లు) ఆదాయాన్ని నమోదు చేసి రికార్డు సృష్టించింది. సెర్చ్, యూట్యూబ్, క్లౌడ్ రంగాలలో వచ్చిన బలమైన వృద్ధి ఈ ఫలితాలకు ప్రధాన కారణమని సీఈఓ సుందర్ పిచాయ్ వెల్లడించారు.
2025 మూడవ త్రైమాసిక (Q3) ఫలితాలను ప్రకటిస్తూ పిచాయ్ మాట్లాడుతూ, ఏఐ ఆధారిత సేవలు కంపెనీ అభివృద్ధికి కీలక శక్తిగా మారాయని చెప్పారు.
జెమినీ ప్రభావం
జెమినీ యాప్ యాక్టివ్ యూజర్లు: నెలకు 650 మిలియన్లు. గత త్రైమాసికంతో పోలిస్తే జెమినీ సెర్చ్ ప్రశ్నలు 3 రెట్లు పెరుగుదల
స్వభావిక భాషా ఆధారిత ఏఐ ప్రయోగాలు, కొత్త ఫీచర్లు ప్రజల్లో విస్తృత ఆదరణ పొందుతున్నాయని పిచాయ్ తెలిపారు.
క్లౌడ్ & సబ్‌స్క్రిప్షన్లు
గూగుల్ క్లౌడ్ బ్యాక్‌లాగ్: $155 బిలియన్ (46% వృద్ధి)
Google One & YouTube Premium సబ్‌స్క్రిప్షన్లు: 300 మిలియన్లను దాటాయి
ప్రపంచవ్యాప్తంగా 40 భాషల్లో అందుబాటులో ఉన్న ‘AI మోడ్’ సేవను రోజూ 75 మిలియన్ యూజర్లు ఉపయోగిస్తున్నట్టు వెల్లడించారు. ఇది సెర్చ్ వినియోగాన్ని మరింత పెంచిందని చెప్పారు.
ఆదాయ వృద్ధి వివరాలు
గూగుల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఫిలిప్ షిండ్లర్ ఇచ్చిన వివరాల ప్రకారం:
Google Services ఆదాయం: $87 బిలియన్ (14% వృద్ధి)
Google Search ఆదాయం: 15% పెరుగుదల — రిటైల్ & ఫైనాన్షియల్ రంగాలు ప్రధాన కారణం
YouTube ప్రకటనల ఆదాయం: 15% వృద్ధి
ఏఐ ఓవర్‌వ్యూస్, ఏఐ మోడ్ వంటి ఫీచర్లు యూజర్ల ప్రశ్నలను, వాణిజ్య సంబంధిత సెర్చ్‌లను పెంచి మరిన్ని ఆదాయ మార్గాలను తెరిచాయని ఆయన అన్నారు

