Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో భద్రతా బలగాలు 10 మంది నక్సలైట్లను హతమార్చాయి. అందులో ముగ్గురు మహిళలు కూడా ఉన్నారు. సంఘటనా స్థలం నుంచి అందరి మృతదేహాలు, 3 ఆటోమేటిక్ ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. ఎన్‌కౌంటర్ తర్వాత సైనికులు సంబరాలు చేసుకోవడం కనిపించింది. అడవిలో సైనికులు ఆయుధాలతో నృత్యం చేశారు. ఈ ఎన్‌కౌంటర్ దంతేస్‌పురం, కొరాజుగూడ, నాగారం బెజ్జి అడవుల్లో జరిగింది. ఈ ఏడాది జనవరి 1 నుంచి నవంబర్ 22 వరకు 207 మంది నక్సలైట్లు భద్రతా దళాల ఎంకౌంటర్స్ లో హతమయ్యారు.
భెజ్జి అడవుల్లో నక్సలైట్లు సమావేశం అయినట్టు భద్రతా బలగాలకు సమాచారం అందింది. దీని తర్వాత అక్కడకు భద్రతా దళాలు చేరుకున్నాయి. అక్కడ నక్సలైట్లతో ఎదురుకాల్పులు జరిగాయి. ఒకరోజు ముందుగానే ఒడిశా మీదుగా సీజీ సరిహద్దులోకి పెద్ద సంఖ్యలో నక్సలైట్లు ప్రవేశించారు. ఈ క్రమంలో ఒడిశా పోలీసులతో ఎన్‌కౌంటర్ కూడా జరిగింది. అప్పుడు ఒక నక్సలైట్ మరణించాడు ఒక సైనికుడు గాయపడ్డాడు.
ఇది కూడా చదవండి: AP News:సామాజిక పింఛన్లపై మరో కీలక నిర్ణయం
Chhattisgarh: ఎన్‌కౌంటర్‌పై మాజీ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ మాట్లాడుతూ 600 గ్రామాల నుంచి కాంగ్రెస్ నక్సలైట్లను ఖాళీ చేయించిందని, పాఠశాలలు, రోడ్లు, విద్య, ఆసుపత్రులు, భూమి లీజులు, ఉపాధి అవకాశాలు కల్పించామని అన్నారు. అందువల్ల, గిరిజనుల విశ్వాసం ప్రభుత్వంపై తిరిగి వచ్చిందని చెప్పారు. అబుజ్మద్‌లో రెండు వంతెనలు నిర్మించడంతో ఈ ఆపరేషన్ విజయవంతమైందని ఆయన అన్నారు.