Tirupati: తిరుపతిలో గంజాయి కలకలం రేపింది. తిరుపతి జాతీయ సంస్కృత యూనివర్సిటీ హాస్టల్‌లో గంజాయి వ్యవహారం పెద్దయెత్తున జరిగింది. పలువురు విద్యార్థుల వద్ద గంజాయి ప్యాకెట్లను రిజిస్ట్రార్ స్వాధీనం చేసుకున్నారు. వర్సిటీలో విద్యార్థులు గంజాయి సేవిస్తున్నట్టు సమాచారం తెలుసుకున్న రిజిస్ట్రార్ ఆకస్మిక తనిఖీలు జరపగా.. శతపతి అనే విద్యార్థి దగ్గర 20 ప్యాకెట్ల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అలాగే గరుడాచల హాస్టల్ లో ఆంజనేయులు అనే విద్యార్థి వద్ద 7 ప్యాకెట్ల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. కాగా ఈ ఘటనపై సమాచారం అందుకున్న యాంటీ డ్రగ్స్ టీం విచారణ జరుపుతున్నామని తెలియ జేసింది.