AP News:సామాజిక పింఛన్ పంపిణీపై ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకున్నది. ఈ నిర్ణయంతో పింఛన్ల పంపిణీని సరళతరం చేసినట్టయింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చీరాగానే పింఛన్ సొమ్మును పెంచిన ప్రభుత్వం తన హామీని నెరవేర్చుకున్నది. ఆ తర్వాత రెండు నెలలపాటు లబ్ధిదారులు పింఛన్ తీసుకోనట్టయితే మూడో నెలలో తీసుకునే వెసులుబాటు కల్పించింది. దీంతో రాష్ట్రంలోని లక్షలాది మంది లబ్ధిదారులు సంతోషంలో మునిగిపోయారు.
AP News:ఈ దశలోనే చంద్రబాబు సర్కారు మరో కీలక నిర్ణయం తీసుకొని ఉదారతను చాటింది. గతంలో వృద్ధాప్య పింఛన్ తీసుకుంటున్న భర్త చనిపోతే ఆ మరుసటి నెల నుంచే అతని భార్యకు వితంతు పింఛన్‌ను మంజూరు చేయనున్నారు. గతంలో వితంతు, ఇతర పింఛన్ల కోసం దరకాస్తులు, విచారణ ప్రక్రియకు నెలలు పడుతుంది. దీంతో అర్హులై ఉండి కూడా నెలల తరబడి కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరగాల్సి వస్తున్నది. కానీ, ఆ ఇబ్బందులను తొలగించేందుకే చంద్రబాబు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నది. కూటమి ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో పింఛన్ల పంపిణీని సరళతరం చేసినట్టయింది.