uttar pradesh: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అమానుష ఘటన చోటుచేసుకున్నది. వనారణ్యంలో ఆహారం దొరక్క జనారణ్యంలోకి వచ్చిన వానరసేనలు ప్రమాదంలో చిక్కుకుంటున్నాయి. వాటి బారి నుంచి తప్పించుకునేందుకు ప్రజలు ఏకంగా వాటి ప్రాణాలనే తీసేస్తున్నారు. కొందరు కావాలనే చంపుతుండగా, మరికొందరికి తెలియకుండానే వాటి ప్రాణాలు పోతున్నాయి. సరిగ్గా ఇలాంటి ఘటనే ఇప్పుడు అక్కడ జరిగింది. ఈ ఘటనలో సుమారు 145 వరకు కోతులు తమ ప్రాణాలు కోల్పోయాయి.
uttar pradesh: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని హథ్రాస్‌లోని ఓ ధాన్యం నిల్వ చేసిన ఎఫ్‌సీఐ గోదాములో ఈ ఘటన చోటు చేసుకున్నది. గోదాములో ఉన్న ధాన్యానికి చీడపీడలు చేరకుండా ఉండేందుకు అక్కడి సిబ్బంది రసాయనాలను పిచికారి చేశారు. ఆ తర్వాత 100కు పైగా ఉన్న కోతుల గుంపు ఆ గోదాములోకి చేరాయి. ఆ ప్రమాదకర రసాయనాలను పీల్చిన కోతులు ఒక్కొక్కటిగా ఆ గోదాములోనే ప్రాణాలిడిచాయి. ఈ ఘటనలో సుమారు 145 కోతులు చనిపోయినట్టు తెలిసింది.
uttar pradesh: అయితే కోతుల గుంపు చనిపోయిన విషయాన్ని గుర్తించిన ఆ సిబ్బంది.. దానిని బయటకు చెప్పలేదు. దీంతో అక్కడే గోతులు తవ్వి ఖననం చేశారు. ఈ విషయం కొన్నిరోజుల తర్వాత ఓ ఉద్యోగి ద్వారా బయటకు పొక్కింది. స్థానికులు పోలీసులకు చేరవేశారు. దానిపై విచారణ జరిపిన పోలీసులు.. కోతులను ఖననం చేసిన గోతి తవ్వి తీసి చూశారు. జరిగిన విషయాన్ని నిర్ధారించుకొని బాధ్యులపై కేసు నమోదు చేశారు.
అయితే దీనిపై అక్కడి హిందూ సంఘాలు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నాయి. జీవహింస నేరమని, వానర జీవులను చంపడం పాపమని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.