Suryapet District: రాష్ట్రంలోని సూర్యాపేట జిల్లాలో తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ గురువారం పర్యటించనున్నారు. జిల్లాలో జరిగే వివిధ కార్యక్రమాల్లో ఆయన పాల్గొననున్నారు. ఈ మేరకు హైదరాబాద్‌లోని రాజ్‌భవన్‌లో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను భారీ సాగునీటి పారుదల శాఖ మంత్రి, జిల్లాకు చెందిన ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఆయన సతీమణి, కోదాడ ఎమ్మెల్యే పద్మావతి దంపతులు మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లాలో గురువారం జరిగే కార్యక్రమాలపై ఆయనతో వారు చర్చించారు.
