తెలంగాణ రాష్ట్రంలోని 9 యూనివర్సిటీలకు ప్రభుత్వం నూతన వైస్ చాన్స్‌లర్ (వీసీ)లను నియమించింది. ఈ మేరకు నియామకపత్రాలపై శుక్రవారం గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆమోదం తెలుపడంతో ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులను జారీ చేసింది. గతంలో ఖాళీగా ఉన్న వీసీల స్థానాల్లో ఐఏఎస్ అధికారులను ఇన్‌చార్జులుగా నియమించారు. అయినా వర్సిటీల్లో వివిధ సమస్యలు పరిష్కారానికి నోచలేదు. దీంతో నూతన వీసీల నియామకానికి ప్రభుత్వం ముందుకొచ్చింది. ఆ 9 యూనివర్సిటీలు, వీసీల పేర్లు ఈ కింది విధంగా ఉన్నాయి.
యూనివర్సిటీ వీసీ పేరు
1) ఉస్మానియా (హైదరాబాద్) – ప్రొఫెసర్ మొగ్లారామ్
2) కాకతీయ (వరంగల్) – ప్రొఫెసర్ ప్రతాప్‌రెడ్డి
3) పాలమూరు (మహబూబ్‌నగర్) – ప్రొఫెసర్ జీఎన్ శ్రీనివాస్
4) మహాత్మాగాంధీ (నల్లగొండ) – ప్రొఫెసర్ అల్తాఫ్ హుస్సేన్
5) శాతవాహన (కరీంనగర్) – ప్రొఫెసర్ ఉమేశ్‌కుమార్
6) తెలుగు (హైదరాబాద్) – ప్రొఫెసర్ నిత్యానందరావు
7) తెలంగాణ (నిజామాబాద్) ప్రొఫెసర్ యాదగిరిరావు
8) జయశంకర్ అగ్రికల్చరల్ (హైదరాబాద్) – ప్రొఫెసర్ అల్దాస్ జానయ్య
9) శ్రీ కొండా లక్ష్మణ్ ఉద్యాన వర్సిటీ – ప్రొఫెసర్ రాజిరెడ్డి