AP Govt: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కడప జిల్లా పేరు పునరుద్ధరిస్తూ ‘వైఎస్సార్ కడప జిల్లా’గా మారుస్తూ అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. మే 26, 2025న మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా ఈ జీవో విడుదలైంది.
తిరిగి వచ్చిన ‘వైఎస్సార్ కడప జిల్లా’ పేరు
దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్. రాజశేఖర రెడ్డి గారి స్మారకంగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాలంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం కడప జిల్లా పేరును ‘వైఎస్సార్ కడప జిల్లా’గా మార్చింది. అయితే 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం ‘కడప’ అనే పదాన్ని తొలగించి, ‘వైఎస్సార్ జిల్లా’గా మాత్రమే వ్యవహరించడం ప్రారంభించింది.
ఈ నిర్ణయం తీవ్ర విమర్శలకు లోనైంది. జిల్లా యొక్క చారిత్రక నేపథిని అస్మరించారని ప్రజాసంఘాలు, రాజకీయ పార్టీలు అభ్యంతరం వ్యక్తం చేశాయి.
ప్రజల కోరనూ, రాజకీయ హామీని గౌరవించిన ప్రభుత్వం
చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో, జిల్లాలో పర్యటించి, తాము అధికారంలోకి వస్తే జిల్లాకు తిరిగి అసలు పేరు తీసుకొస్తామని హామీ ఇచ్చారు. తాజా మంత్రి సత్యకుమార్ ముఖ్యమంత్రికి లేఖ రాస్తూ అదే విజ్ఞప్తి చేశారు.
ఇది కూడా చదవండి: Jagdeep Dhankhar: భారతదేశం ఇప్పుడు మారిపోయింది.. ఉగ్రవాదాన్ని అస్సలు సహించదు
ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తులను పరిగణలోకి తీసుకొని, కేబినెట్ స్థాయిలో చర్చించి, జిల్లా పేరును పునరుద్ధరించాలనే నిర్ణయం తీసుకుంది చంద్రబాబు నేతృత్వంలోని ప్రభుత్వం. దీంతో ‘వైఎస్సార్ కడప జిల్లా’ అనే పూర్తి పేరు తిరిగి అధికారికంగా అమలులోకి వచ్చింది.
జిల్లా చరిత్రకు మర్యాదగా ఈ నిర్ణయం
ఈ నిర్ణయం కడప జిల్లాలోని ప్రజల్లో ఆనందాన్ని కలిగించింది. జిల్లా చరిత్రను కాపాడుతూ, దివంగత నేతకు గౌరవం కలిగిస్తూ తీసుకున్న ఈ నిర్ణయం రాజకీయ, సామాజిక వర్గాల నుంచి ప్రశంసలు పొందుతోంది.