Uttam Kumar: కొత్త రేషన్ కార్డుల జారిపై మంత్రి ఉత్తమ్ ఏమన్నారంటే.

Uttam Kumar: బీఆర్ఎస్ పార్టీ విమర్శలు చేశారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి.గడిచిన 10 ఏళ్ల బీఆర్ఎస్ అనాలోచిత నిర్ణయాల వల్ల సివిల్ సప్లై శాఖ నిర్వీర్యం అయిందని ధ్వజమెత్తారు. మేము అధికారంలోకి వచ్చాక ఈ శాఖలో రూ.55 వేల కోట్ల అప్పుని రూ.11 వేల కోట్లకు తగ్గించామన్నారు. ధాన్యం సేకరణ విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లా కలెక్టర్లతో కాన్ఫరెన్స్ నిర్వహించారని, ప్రతి ఉమ్మడి జిల్లాకు ప్రత్యేక అధికారులతో పర్యావేక్షన పెట్టామన్నారు.బీఆర్ఎస్ రాజకీయ అవసరాల కోసం ఏమైనా మాట్లాడుతుండవచ్చని కానీ సివిల్ సప్లై డిపార్ట్ మెంట్ గతంలో కంటే ప్రస్తుతం చాలా మెరుగ్గా పని చేస్తున్నదన్నారు.

మూసీపై బీఆర్ఎస్ కావాలనే రాద్ధాంతం చేస్తున్నదని, మూసీ పునరుజ్జీవాన్ని నల్గొండ ప్రజలు స్వాగతిస్తున్నారని చెప్పారు.సీఎంగా రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎంగా భట్టి విక్రమార్క, మంత్రులుగా మేమంతా ఓ టీమ్ గా సమిష్టిగా ముందుకు వెళ్తున్నామన్నారు. సుప్రీంకోర్టు తీర్పు స్టడీ చేశాకే వర్గీకరణపై సబ్ కమిటీ ఏర్పాటు అయిందని, వర్గీకరణపై వన్ మెన్ జ్యుడిషియల్ కమిషన్ కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు. కులగణన, ధాన్యం సేకరణ పూర్తయ్యాక తెల్లరేషన్ కార్డుల జారీపై నిర్ణయం తీసుకుంటామన్నారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Ponnam Prabhakar: సర్వే వల్ల సంక్షేమ పథకాల కోత ఉండదు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *