YS Jagan: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి వారసుడిగా రాజకీయ అరంగేట్రం చేసిన జగన్… తండ్రి అకాల మరణంతో ఉన్న పార్టీని కాదని అనుచరులను క్యాడర్‌ను బయటకు తీసుకుని వచ్చి యువజన కాంగ్రెస్ రైతు శ్రామిక పార్టీని స్థాపించారు. పార్టీ ఆవిర్భావం నుంచి ఒడిదుడుకులు ఎదుర్కొంటూ ప్రజల సమస్యలు తెలుసుకుంటే రాజశేఖర్ రెడ్డి వారసుడిగా జగన్‌కు అవకాశం ఇవ్వాలని ప్రజలు నిర్ణయించుకున్నారు. అది రాజశేఖర్ రెడ్డి రాజసం మళ్లీ వస్తుందని భావించారు. కానీ ప్రజలు ఊహించింది ఒకటైతే జగన్ చేసింది మరోకటి…
YS Jagan: ఇదంతా బాగానే ఉంది కానీ 2019లో జగన్ అధికారంలోకి వచ్చారో లేదో కూల్చివేతలతో ప్రారంభమైంది. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎన్నడూ చూడని విధ్వంసాన్ని గత ఐదేళ్లలో చూశారంటే అతిశయోక్తి లేదు. వ్యక్తిగత దూషణలు, దాడులపై పెట్టిన శ్రద్ధ ప్రజా పరిపాలనపై పెట్టి ఉంటే ఆ పార్టీ నినాదమైన 175 కు 175 ప్రజలు ఇచ్చిండేవారు. గత ఐదేళ్ల వైసీపీ పాలనలో ఏం జరిగింది? అభివృద్ధి ఉన్నది ఎవరి కాలంలో అనావృష్టి జరిగింది ఎవరి కాలంలో అన్నది ప్రజలు అంచనా వేసి ఎన్నికల్లో తిరుగులేని విజయాన్ని కూటమికి కట్టబెట్టారు. దీంతో వైసీపీ అధినేత జగన్ అయోమయంలో పడ్డారు.
YS Jagan: కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ హామీల పేరుతో ఇచ్చినవన్నీ వచ్చిన ఆరు నెలల్లో ఒక్కొక్కటిగా అమలు చేస్తుంది. దీంతో కూటమి ప్రభుత్వానికి ప్రజలు పట్టం కట్టిన వెంటనే న్యాయం జరుగుతుందని ఆశతో గత ఐదేళ్లు ఏం నష్టపోయామని తెలిపారు. ఇప్పుడు రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయాలంటే కావాల్సింది కూటమి ప్రభుత్వం అని అనుకున్నారు దీంతో ఆరు నెలల కాలంలో అభివృద్ధి అంటే ఏంటో చూసిన జగన్ ఇటు పార్టీలో ఉన్న కేడర్‌ను కాపాడుకోలేక వెళ్ళిపోతున్న కార్యకర్తలను ఆపలేక
సతమతమవుతున్నారు. ఆరు నెలల కాలం గడిచాక గతంలో చేసిన తప్పులే ఇప్పుడు కూటమి చేసినట్టుగా చెబుతూ
యుద్ధానికి సిద్ధమవుతున్నా అని జగన్ పిలుపు నిచ్చారు. మూడు ప్రధాన అంశాలపై పోరాటం చేస్తామని తెలిపారు.
YS Jagan: అందులో మొదటిది రైతు సమస్యలు గత ఐదేళ్లలో రైతులు అనేక సమస్యలు ఎదుర్కొంటూ గిట్టుబాటు ధర పంట నష్టం ఏమీ సరైనటువంటివి లేక అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొంటూ కనీసం ధాన్యాన్ని నిలవ చేసే గోని సంచులు కూడా ఏర్పాటు చేయలేనిది వైసీపీ ప్రభుత్వం… ప్రస్తుతం కూటమి సర్కార్ దీనికి పరిష్కారం మార్గం చూపిస్తూ రైతుల కోసం ప్రత్యేక యాప్‌ను తీసుకొచ్చి రైతులకు మేలు చేసింది రెండవ అంశం గత వైసీపీ హయాంలో పెంచిన కరెంటు చార్జీలు గతం ఎన్నడూ పెంచలేదు.
YS Jagan: అదే విధంగా సోలార్ విద్యుత్‌పై జగన్, అదానీ అక్రమ ముడుపుల విషయం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయింది ఇక మూడవ అంశంగా ఫీజు రీయింబర్స్మెంట్ గత ఐదేళ్లలో తీసుకొని విద్యార్థులు కోకొల్లలుగా కనపడుతూనే ఉన్నారు.
ఫీజు రీయింబర్స్మెంట్ పడితే పథకాలు కట్టంటూ ప్రజలను నిలువునా దోపిడీ చేసి రేట్ల నియంత్రణ లేకుండా ఇష్టారీతిన అన్ని చార్జీలు రేట్లు పెంచి పేదవాడి బ్రతుకు బరువుగా మారేలా గత వైసీపీ పాలనంత సాగింది. ఇప్పటికైనా ప్రజలు నిజమైన సమస్యలు ఏంటి ప్రభుత్వం దృష్టికి ఎలాంటి సమస్యలు తీసుకెళ్లాలి. ప్రజల పక్షాన ఏ విధంగా పోరాటం చేయాలని అంశాలపై వైసీపీ దృష్టి పెడితే ఈ ఐదు సంవత్సరాలు ఆ పార్టీకి మనుగడ ఉంటుంది.
YS Jagan: ఇప్పటికే క్యాడర్ దూరమై పార్టీ పరిస్థితి ఏంటా అనుకునే స్థితికి వచ్చింది. ఇప్పుడు రానున్న మున్సిపల్ పంచాయితీ ఎన్నికల్లో క్యాడర్‌ను బలంగా నిలిపి కూటమి పార్టీలకు పోటీ ఇవ్వాలని వైసీపీ అధినేత జగన్ నిర్ణయించుకున్నారు. ఇప్పటికే జిల్లాల వారీగా సమావేశాలు నిర్వహించారు. ఆ జిల్లాల వారీగా తొలి విడత సమావేశాలు నిర్వహించారు. మళ్లీ రాష్ట్రస్థాయి పర్యటనలు క్యాడర్‌తో చర్చించిన తర్వాత కొన్ని జిల్లాలతో ప్రధానంగా చర్చిస్తున్నారు. అయితే జగన్ ఎలాంటి అంశాలు చర్చిస్తున్నారు. ఎన్నికలకు ఏ విధమైన వ్యూహాలు రచిస్తున్నారు. వైసీపీ కేడర్‌కు ఎలాంటి దిశ నిర్దేశం చేస్తున్నారు. అనేది రానున్న కాలంలో వైసీపీ భవిష్యత్తును నిర్ణయించనుంది.