Chittoor Crime: దేశంలో ఎన్ని చట్టాలు వచ్చినా మహిళలు, చిన్నారులపై అఘాయిత్యాలు మాత్రం ఆగడం లేదు. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా దుర్మార్గులు నేరాలకు పాల్పడుతున్నారు. చిన్నారులకు చాక్లెట్ ఆశజూపి అత్యాచారాలకు పాల్పడిన ఘటనలు ఎన్నో చూశాం. యువతులకు వారికి నచ్చిన వాటిని ఇస్తానాని ఆశలు రేపి అత్యాచారాలకు పాల్పడిన నేరాలు కూడా వెలుగులోకి వచ్చాయి. తాజాగా అలాంటి ఘటనే చిత్తూరు జిల్లా కార్వేటినగరం మండంలో చోటుచేసుకుంది. సినిమాకు తీసుకెళ్తానని చెప్పి ఓ యువకుడు యువతిపై అత్యాచారానికి ఒడిగట్టినట్లు తెలిసింది.
చిత్తూరు జిల్లా కార్వేటినగరం మండలంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. గోపిశెట్టిపల్లి దళితవాడకు చెందిన ఓ యువకుడు మైనర్ బాలికను తమిళనాడు రాష్ట్రం తిరువల్లూరు జిల్లా పల్లిపట్టులో సినిమాకు తీసుకెళ్తాను అంటూ మాయమాటలు చెప్పి యువతిని మార్గమధ్యంలో పొలాల్లోకి తీసుకెళ్లి అత్యాచారం చేపి పారిపోయాడు…
Chittoor Crime: యువతి తేరుకొని ఊళ్లోకి వెళ్లి కుటుంబ సభ్యులతో జరిగిన సంఘటనను చెప్పడంతో..యువతి తండ్రి వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చాడు.. రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకొని దర్యాప్తు చేపట్టారు. యువతిని ఆరోగ్య పరిక్షల నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు సీఐ హనుమంతప్ప వివరాలను వెల్లడించారు.