Nandus World: సోషల్ మీడియా ఎంతో పాపులర్ అయిన ‘నందూస్ వరల్డ్’ (Nandus World) యూట్యూబ్ ఛానల్ జంటకు చట్టపరమైన ఉచ్చు మరింతగా బిగుస్తోంది. ప్రముఖ మహిళా యూట్యూబర్ రమా నందన, ఆమె భర్త మధుకర్ జాగర్లమూడిలపై ఇబ్రహీంపట్నం పోలీసులు లుక్‌అవుట్ (Lookout) నోటీసులు జారీ చేయడం ఇప్పుడు తీవ్ర సంచలనంగా మారింది.
కోట్ల రూపాయల వీసా మోసం!
యూట్యూబ్‌లో ట్రావెల్ వ్లాగ్స్, ఫ్యామిలీ కంటెంట్‌తో మంచి గుర్తింపు తెచ్చుకున్న రమా నందన, మధుకర్ దంపతులపై గత కొంతకాలంగా తీవ్రమైన మోసం ఆరోపణలు వస్తున్నాయి.
యునైటెడ్ కింగ్‌డమ్ (UK) వీసాల రెన్యూవల్ (UK Visa Renewal) పేరుతో వీరు పలువురిని నమ్మించి, పెద్ద ఎత్తున కోట్ల రూపాయల వసూళ్లకు మరియు మోసాలకు పాల్పడినట్లు వీరిపై పోలీసులకు ఫిర్యాదులు అందాయి.
