Telangana: కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గం సింగాపూర్ సమీపంలో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువతిని ప్రాణాపాయం నుంచి రక్షించారు. లారీ కింద ఇరుక్కున్న ఆ యువతిని వాహన డ్రైవర్లు, స్థానికులు శతవిధాలా శ్రమించి ఆమెను బయటకు రప్పించి ఆదుకున్నారు.
Telangana: మానకొండూరు మండలం ఖెల్లడ గ్రామానికి చెందిన యువతి దివ్యశ్రీ.. ఈ రోడ్డు ప్రమాదంలో లారీ బాడీ కింద ఇరుక్కుపోయింది. లారీ బాడీ, కమాన్ పట్టాలు ఆమెపై పడి ఉండటంతో ఆమె బయటకు రాలేక, తీవ్ర ప్రమాదంలో పడిపోయింది. దీంతో ఆమె ప్రాణాలకు ప్రమాదం ఏర్పడింది. రక్తం కారుతుండగా, టైరు కింద ఆమె జుట్టు పడి ఉండి ఆమె బయటకు రాలేకపోయింది.
Telangana: ఇదే సమయంలో ములుగు పర్యటనకు వెళ్తున్న కేంద్ర మంత్రి, కరీంనగర్ ఎంపీ అయిన బండి సంజయ్ ఇదే సమయంలో అటుగా వెళ్తూ ఆగారు. ప్రమాదాన్ని చూసిన ఆయన అటుగా వెళ్తున్న లారీలు, ఇతర వాహనాలు నిలిపి డ్రైవర్ల సాయం అడిగారు. జాకీలు, కత్తెర తెప్పించారు. ఆ యువతి జుట్టును కత్తిరించి, జాకీలు ఎత్తిపట్టి ప్రాణాపాయం నుంచి బయటకు రప్పించారు. తీవ్రగాయాలపాలైన ఆ యువతిని కరీంనగర్‌లోని ఆస్పత్రికి చికిత్స కోసం తరలించారు. చికిత్సకు అయ్యే ఖర్చును తానే చెల్లిస్తానని ఆస్పత్రి వైద్యులకు బండి సంజయ్ చెప్పి లైఫ్‌లైన్ ప్రైవేట్ ఆస్పత్రికి ఆమెను పంపించి మానవత్వాన్ని చాటుకున్నారు.