Coco Gauff

Coco Gauff: డబ్ల్యూటీఏ ఫైనల్స్‌ విజేత కొకో గాఫ్‌

Coco Gauff: అమెరికా టెన్నిస్‌ స్టార్‌ కొకో గాఫ్‌ కెరీర్‌లో తొలిసారి డబ్ల్యూటీఏ ఫైనల్స్‌ టైటిల్‌ను గెలుచుకుంది. ఒలింపిక్ చాంపియన్ చైనాకు చెందిన జెంగ్ కిన్వెన్ తో జరిగిన ఫైనల్లో 3-6, 6-4, 7-6 (7-2) స్కోరుతో హారాహోరీ పోరాటంలో  విజయం సాధించింది. 20 ఏళ్ల గాఫ్‌ రెండో సెట్లో 0-2తో, 3-5తో వెనుకబడ్డా పుంజుకుంది. ఓ దశలో పరాజయానికి రెండు పాయింట్ల దూరంలో నిలిచినా.. పట్టుదలగా పోరాడి గెలిచింది. మరోవైపు  డబుల్స్ ఫైనల్లో  గాబ్రియెలా దబ్రోవ్‌స్కీ ,ఎరిన్‌ రౌట్లిఫ్‌ జోడీ .. 7-5, 6-3తో సైనికోవ్‌, టౌన్సెండ్‌ జంటపై విజయంతో ట్రోఫీని సొంతం చేసుకుంది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Ap news: 30 మంది ప్రయాణిస్తున్న బస్సు దగ్ధం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *