Australia vs Pakistan: పాకిస్థాన్ టీమ్ కు ఓ బిగ్ రిలీఫ్.. గత కొంతకాలంగా వరుస పరాభవాలు.. జట్టులో విభేదాలు.. బోర్డులో అంతర్గత సమస్యలు.. కెప్టెన్ల మార్పు.. కోచ్‌ల రాజీనామా.. ఇలా పలు సమస్యలతో సతమతమవుతున్న పాకిస్థాన్ క్రికెట్ జట్టుకు ఆసీస్ గడ్డపై ఓ చిరస్మరణీయ సిరీస్ విజయం దక్కింది. 12 ఏండ్ల తర్వాత ఆసీస్ గడ్డపై వన్డే సిరీస్ విక్టరీ అందుకుంది పాకిస్థాన్ టీమ్..
కొత్త కెప్టెన్ మహమ్మద్ రిజ్వాన్ సారథ్యంలోని పాకిస్థాన్ జట్టు 12 ఏళ్ల అనంతరం ఆస్ట్రేలియాలో వన్డే సిరీస్ గెలిచుకుంది. ఆదివారం జరిగిన చివరి వన్డేలో 8 వికెట్ల తేడాతో ఆసీస్‌ను చిత్తు చేసి, సిరీస్‌ను 2-1తో సొంతం చేసుకుంది. వరుస పరాభవాలు.. జట్టులో విభేదాలు.. బోర్డులో అంతర్గత సమస్యలు.. కెప్టెన్ల మార్పు.. కోచ్‌ల రాజీనామా.. ఇలా కొంతకాలంగా సతమతమవుతున్న పాకిస్థాన్ క్రికెట్ జట్టుకు ఓ చిరస్మరణీయ సిరీస్ విజయం దక్కింది.
ఇది కూడా చదవండి: Coco Gauff: డబ్ల్యూటీఏ ఫైనల్స్ విజేత కొకో గాఫ్
Australia vs Pakistan: భారత్‌తో టెస్టు సిరీస్ నేపథ్యంలో ఈ మ్యాచ్‌కు కెప్టెన్ కమిన్స్, స్మిత్, హేజిల్‌వుడ్, స్టార్క్, లబుషేన్ విశ్రాంతి తీసుకోవడంతో బలహీనపడ్డ ఆస్ట్రేలియా.. పాక్ ముందు తేలిపోయింది. మొదట బ్యాటింగ్ చేసిన ఆసీస్ జట్టు 31.5 ఓవర్లలో 140 పరుగులకే ఆలౌటైంది. 30 పరుగులతో సీన్ అబాట్ టాప్‌స్కోరర్ గా నిలిచాడు. పాకిస్థాన్ పేస్ త్రయం హారిస్ రవూఫ్ 2 వికెట్లు, షహీన్ షా అఫ్రిది 3 వికెట్లు, నసీం షా 3 వికెట్లతో కంగారూ జట్టును దెబ్బతీశారు. అనంతరం ఛేదనలో కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయిన పాకిస్థాన్ జట్టు 26.5 ఓవర్లలో లక్ష్యాన్ని అందుకుంది. ఓపెనర్లు సయీం ఆయూబ్ 42 పరుగులు, అబ్దుల్లా షఫీక్ 37 పరుగలు చేశారు. తొలి వికెట్‌కు 84 పరుగులు జోడించి జట్టు విజయానికి బలమైన పునాది వేయగా.. అనంతరం రిజ్వాన్ 30 నాటౌట్. బాబర్ అజామ్ 28 నాటౌట్ తో నిలిచి జట్టుకు విజయాన్నందించారు.