Yash: ‘కేజీఎఫ్’తో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న యశ్ నటిస్తున్న మరో పాన్ ఇండియా మూవీ ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్’. వెంకట్ కె నారాయణ నిర్మిస్తున్న ఈ సినిమాను ఒకప్పటి నటి గీతు మోహన్ దాస్ తెరకెక్కిస్తున్నారు. విజువల్ గ్రాండియర్ గా, ఎమోషనల్, పవర్ ఫుల్ కథతో ‘టాక్సిక్’ తెరకెక్కుతోంది. జనవరి 8న యశ్ బర్త్ డే సందర్భంగా ఈ మూవీ నుండి టీజర్ ను రిలీజ్ చేశారు.
Yash: రెట్రో అండ్ స్టైలిష్ లుక్ లో యశ్ అదరగొట్టాడు. కారు దిగి నోట్లో సిగార్ తో క్లబ్ లోకి అతను అడుగుపెట్టే సీన్ చూసి అభిమానులు ఫిదా కావడం ఖాయం. ఈ సీన్ చూస్తే చాలు మూవీని ఎంత రిచ్ గా తీయబోతున్నారో అర్థమౌతుంది. ఇదే యేడాది ‘టాక్సిక్’ మూవీ జనం ముందుకు రాబోతోంది.
ఇది కూడా చదవండి: Oscars 2025: చర్చలకు తెరలేపిన ఆస్కార్ ఇండియన్ షార్ట్ లిస్ట్
అనిరుథ్ కు రెహ్మాన్ ‘క్లాసిక్’ సజెషన్!
Anirudh: ఇవాళ అనిరుథ్ జాతీయ స్థాయిలో సంగీత దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. తమిళ స్టార్ హీరోలే కాదు… తెలుగు స్టార్ హీరోలు సైతం అనిరుథ్ తో సినిమా చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. కానీ చిత్రం ఏమంటే… అనిరుథ్ ఖాతాలో మంచి మెలోడీలు ఏవీ లేవు. బహుశా ఈ విషయాన్ని గమనించే కావచ్చు ఆస్కార్ విజేత ఎ.ఆర్. రెహమాన్ అనిరుథ్ కు అలాంటి ఓ సలహాను ఇచ్చారు.
Anirudh: జయం రవి, నిత్యామీనన్ జంటగా ఉదయనిధి స్టాలిన్ నిర్మించిన ‘కాదలిక్కు నేరమిల్లే’ చిత్రం పొంగల్ కానుకగా రాబోతోంది. దీనికి రెహమాన్ సంగీతాన్ని అందించారు. ఈ సినిమా ఆడియో వేడుకలో రెహమాన్ మాట్లాడుతూ, అనిరుథ్ ను క్లాసికల్ సాంగ్ కు స్వరాలు అందించాల్సిందిగా సలహా ఇచ్చాడు. అలాంటి పాటలు యువతను బాగా ఆకట్టుకోవడంతో పాటు పది కాలాల పాటు గుర్తు ఉంటాయని రెహమాన్ చెప్పాడు. మరి రెహమాన్ సలహాను అనిరుధ్ ఏమేరకు మనసులోకి తీసుకుంటాడో చూడాలి.