Women’s APL: ఆంధ్రప్రదేశ్ మహిళా క్రికెట్ చరిత్రలో ఒక సరికొత్త అధ్యాయం ఆరంభం కాబోతోంది. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ (ACA) ఆధ్వర్యంలో తొలిసారి అధికారిక ఫ్రాంచైజీల పద్ధతిలో నిర్వహిస్తున్న ‘ఉమెన్స్ ఆంధ్ర ప్రీమియర్ లీగ్ 2026’ (Women’s APL 2026) సెప్టెంబర్ 19 నుంచి ఘనంగా ప్రారంభం కానుంది. సాధారణ రైతు బిడ్డల నుంచి రోజువారీ డ్రైవర్లు, చిరువ్యాపారుల కుటుంబాల వరకు ఎందరో ప్రతిభావంతులైన యువ క్రీడాకారిణులు తమ సత్తా చాటేందుకు ఈ లీగ్ వేదికగా నిలుస్తోంది. భారత మహిళా క్రికెట్ దిగ్గజం, మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ ఈ లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నారు.
నాలుగు జట్లు – లీగ్ ఫార్మాట్..
ఆగస్టు 25న నిర్వహించిన ప్లేయర్ల వేలంలో 191 మంది రిజిస్టర్ చేసుకోగా, తుది జట్లను ఎంపిక చేశారు. మొత్తం నాలుగు ఫ్రాంచైజీ జట్లు ఈ టోర్నీలో పోటీపడుతున్నాయి..
-
రాయలసీమ ఎక్స్ఈఎన్ స్టార్స్
-
గోదావరి గోల్డెన్ ఈగల్స్
-
వైజాగ్ ఫైర్ బర్డ్స్
-
రామోజీ గ్రూప్స్ అమరావతి ఈ ఛాంపియన్స్
వేదిక & ఫార్మాట్..మొత్తం టోర్నీలోని అన్ని మ్యాచ్‌లకు ఏసీఏ మంగళగిరి అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం ఆతిథ్యమిస్తోంది. ప్రతి జట్టు మిగతా మూడు జట్లతో రెండేసి సార్లు (డబుల్ రౌండ్-రాబిన్) తలపడుతుంది. ఒక్కో జట్టు 6 లీగ్ మ్యాచ్‌లు ఆడనుండగా, మొత్తం 12 లీగ్ మ్యాచ్‌లు పూర్తయ్యాక పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచిన టాప్-2 జట్లు సెప్టెంబర్ 27న జరిగే గ్రాండ్ ఫైనల్లో పోటీపడతాయి. వర్షం వస్తే సెప్టెంబర్ 28ను రిజర్వ్ డేగా కేటాయించారు.
ఉమెన్స్ ఏపీఎల్ 2026 – పూర్తి మ్యాచ్‌ల షెడ్యూల్..
| తేదీ | సమయం | మ్యాచ్ వివరాలు |
| సెప్టెంబర్ 19 | మధ్యాహ్నం 1:30 | రాయలసీమ ఎక్స్ఈఎన్ స్టార్స్ vs గోదావరి గోల్డెన్ ఈగల్స్ |
| సెప్టెంబర్ 19 | సాయంత్రం 6:00 | వైజాగ్ ఫైర్ బర్డ్స్ vs అమరావతి ఈ ఛాంపియన్స్ |
| సెప్టెంబర్ 20 | మధ్యాహ్నం 1:30 | అమరావతి ఈ ఛాంపియన్స్ vs రాయలసీమ ఎక్స్ఈఎన్ స్టార్స్ |
| సెప్టెంబర్ 20 | సాయంత్రం 5:30 | గోదావరి గోల్డెన్ ఈగల్స్ vs వైజాగ్ ఫైర్ బర్డ్స్ |
| సెప్టెంబర్ 21 | మధ్యాహ్నం 1:30 | గోదావరి గోల్డెన్ ఈగల్స్ vs అమరావతి ఈ ఛాంపియన్స్ |
| సెప్టెంబర్ 21 | సాయంత్రం 5:30 | రాయలసీమ ఎక్స్ఈఎన్ స్టార్స్ vs వైజాగ్ ఫైర్ బర్డ్స్ |
| సెప్టెంబర్ 23 | మధ్యాహ్నం 1:30 | అమరావతి ఈ ఛాంపియన్స్ vs వైజాగ్ ఫైర్ బర్డ్స్ |
| సెప్టెంబర్ 23 | సాయంత్రం 5:30 | గోదావరి గోల్డెన్ ఈగల్స్ vs రాయలసీమ ఎక్స్ఈఎన్ స్టార్స్ |
| సెప్టెంబర్ 24 | మధ్యాహ్నం 1:30 | వైజాగ్ ఫైర్ బర్డ్స్ vs రాయలసీమ ఎక్స్ఈఎన్ స్టార్స్ |
| సెప్టెంబర్ 24 | సాయంత్రం 5:30 | అమరావతి ఈ ఛాంపియన్స్ vs గోదావరి గోల్డెన్ ఈగల్స్ |
| సెప్టెంబర్ 25 | మధ్యాహ్నం 1:30 | వైజాగ్ ఫైర్ బర్డ్స్ vs గోదావరి గోల్డెన్ ఈగల్స్ |
| సెప్టెంబర్ 25 | సాయంత్రం 5:30 | రాయలసీమ ఎక్స్ఈఎన్ స్టార్స్ vs అమరావతి ఈ ఛాంపియన్స్ |
| సెప్టెంబర్ 27 | సాయంత్రం 6:30 | గ్రాండ్ ఫైనల్ (రిజర్వ్ డే: సెప్టెంబర్ 28) |
నాలుగు జట్ల స్క్వాడ్ వివరాలు..
వైజాగ్ ఫైర్ బర్డ్స్..
భారత పేసర్ కె. అంజలి శర్వాణితో పాటు పల్లా యుహాసిని, కె. యశస్విని మణివల్లి, శరణ్య గద్వాల్, అయేషా సింగ్, దాసరి విశ్వశ్రీ, పెండ్యాల సరయు, కెవైఎం విష్ణు వర్ధిని, ఎం. హాసిని చౌదరి, బి. మధుర సంజనా ప్రియా, మయస్సర్ అంజుమ్, వీర విద్యాశ్రీ, నక్క సమంత, కొప్పుల దివ్యశ్రీ, వురుకుటి పుష్పలత, బీవీఎస్ఎల్ఎస్ఆర్ఎస్ సాయి తన్మయి, పల్నాటి రిషిక కృష్ణన్, ఎం. నియతి రాజ్.
రామోజీ గ్రూప్స్ అమరావతి ఈ ఛాంపియన్స్..
బోగియా సాయి దీప్తి, కె. హేమ సాయి రమ్య, తారిణి జోషి, ఎం. రుక్సార్ తబసుం, కాట్రగడ్డ దీక్ష, నక్క సనా, బొడ్డుపల్లి తనిష్క, పరాస రంగలక్ష్మి, కె. హంస, తాళ్లూరి మల్లిక, కర్రి సాయి పూజిత, నీరగట్టు అనూష, ఓరుగంటి సాహితి శ్రీ, కట్టా మహంతి శ్రీ, అంకం విష్ణుప్రియ, కందరేగుల దేవిక, ఎం. సహస్ర రెడ్డి, షబ్నమ్ ఎండీ షకీల్.
రాయలసీమ ఎక్స్ఈఎన్ స్టార్స్..
గారపాటి లిఖిత, దారా చైత్ర, కె. వాసవి అఖిల పావని, వై. హేమ రోషిణి, అల్లుగుంటి హన్సి రెడ్డి, ఎం. గ్రీష్మ సైని రెడ్డి, జి. వర్ష, సజ్జ సాయి లక్ష్మి, జె. మేఘనా శ్రీ, వేములపాటి సేతు సాయి, కె. హర్షిత గౌడ, ఆవుల చిన్న సిరీష, నల్లపు రెడ్డి శ్రీ చరణి, కొలత్తూర్ సుభశ్రీ, ఎ. షణ్ముఖ ప్రియ, కొక్కిలిగడ్డ ధాత్రి, మలకొండ పూజిత, ఎల్లుట్ల పద్మజ, జి. ముని నీతిష, బారెడ్డి మల్లి అనూష.
గోదావరి గోల్డెన్ ఈగల్స్..
చింతపల్లి మెహర్ లహరి, పి. వనజాక్షి, కింతాడ వైష్ణవి, బత్తుల హర్షిత, గామిడి రాఘ చౌదరి, వడ్డె అక్షయ, పేక విన్నీ సుజాన్, సాది అదితి మేఘనా రెడ్డి, శ్రిష్టి శేఖర్, సంగాని దుర్గా భవాని, కోరుకొండ హారిక, పసగడుగుల వైష్ణవి, హెన్రియెట్టా ఫ్లావియా పెరీరా, టి. నివేదిత, బగ్గం అంజనా, గుండుపల్లి ఉద్విత, ఎం. మహాలక్ష్మి మనోజ, కె. పుష్పిత గౌడ.
