Vijay Sethupathi: కన్నడలో రూపుదిద్దుకున్న చిత్రం కోర. ఇప్పుడీ యాక్షన్ జానర్, పీరియాడిక్ డ్రామా తెలుగులో విడుదల కాబోతోంది. ఒరాటశ్రీ దర్శకత్వంలో సునామీ కిట్టి హీరోగా నటించిన సినిమాలో ఛరిష్మా, పి. మూర్తి ప్రధాన పాత్రలు పోషించారు. డా.ఎ.బి. నందిని, ఎ.ఎన్. బాలాజీ, పి. మూర్తి దీనిని నర్మించారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, గ్లింప్స్ కు చక్కని ఆదరణ లభించిందని నిర్మాతలు తెలిపారు. తాజాగా మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి ఈ మూవీ టీజర్ ను రిలీజ్ చేస్తూ చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. బిఆర్ హేమంత్ కుమార్ కోర చిత్రానికి సంగీతం అందించారు.
Return Of The Dragon: ‘రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్’ నుండి ఫస్ట్ సింగిల్!
Return Of The Dragon: ‘లవ్ టుడే’ మూవీతో తెలుగువారికి కూడా చేరువయ్యాడు దర్శకుడు, కథానాయకుడు ప్రదీప్ రంగనాథన్. అతను హీరోగా అశ్వత్ మారిముత్తు తెరకెక్కిస్తున్న సినిమా ‘రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్’. ఈ మూవీ నుండి ‘రైజ్ ఆఫ్ ది డ్రాగన్’ పేరుతో ఫస్ట్ సింగిల్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ పాటకు రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందిండగా, లియోన్ జేమ్స్ తనే స్వరాలు సమకూర్చి, నదీషా థామస్ తో కలిసి పాడారు. ఈ పాటలో ప్రదీప్ రంగనాథన్ తో పాటు ప్రముఖ దర్శకుడు గౌతమ్ వాసుదేవ మీనన్ డాన్స్ చేయడం విశేషం. ‘లవ్ టుడే’ మూవీని నిర్మించిన ఏజీఎస్ ఎంటర్ టైన్ మెంట్ సంస్థే ఇప్పుడీ సినిమానూ నిర్మిస్తోంది. ఈ చిత్ర దర్శకుడు అశ్వత్ మారిముత్తు తమిళంలో ‘ఓ మై కడవులే’ చిత్రాన్ని రూపొందించాడు. అదే చిత్రం తెలుగు రీమేక్ ‘ఓరి దేవుడా’కూ అతనే దర్శకుడు. ‘రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్’ మూవీలో కె.ఎస్.రవికుమార్, మిస్కిన్, వి.జె.సిద్ధు, హర్షత్ ఖాన్, అనుపమ పరమేశ్వరన్, కయాదు లోహర్ తదితరులు ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు.