stock market news

Stock Market News: మహారాష్ట్ర రిజల్ట్స్ ఎఫెక్ట్ ఈరోజూ కొనసాగుతుందా? స్టాక్ మార్కెట్ ఎలా ఉండబోతోంది?

Stock Market News: మహారాష్ట్ర ఎన్నికల ఫలితాల సెంటిమెంట్ తో సోమవారం స్టాక్ మార్కెట్ పాజిటివ్ గానే కదిలింది.  సెన్సెక్స్ 992 పాయింట్ల లాభంతో 80,109 వద్ద ముగిసింది. నిఫ్టీ కూడా 314 పాయింట్లు లాభపడి 24,221 వద్ద ముగిసింది. అదే సమయంలో, బిఎస్‌ఇ స్మాల్‌క్యాప్ 976 పాయింట్లు పెరిగి 53,589 స్థాయి వద్ద ముగిసింది.

సెన్సెక్స్‌లోని 30 షేర్లలో 24 పెరగ్గా, 6 క్షీణించాయి. 50 నిఫ్టీ స్టాక్స్‌లో 43 లాభపడగా, 7 నష్టపోయాయి. ఎన్‌ఎస్‌ఈలోని అన్ని రంగాల సూచీలు లాభాలతో ముగిశాయి. నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంక్ అత్యధికంగా 4.16 శాతం పెరిగింది. 

నిన్నటి స్టాక్ మార్కెట్ హైలైట్స్ ఇవే.. 

  • హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, లార్సెన్ అండ్ టూబ్రో, ఐసిఐసిఐ బ్యాంక్, రిలయన్స్ మార్కెట్‌ను ఎక్కువగా నడిపించాయి. కాగా, ఇన్ఫోసిస్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, టెక్ మహీంద్రా, ఏషియన్ పెయింట్ షేర్లు మార్కెట్‌ను దిగజార్చాయి.
  • ఆసియా మార్కెట్‌లో జపాన్‌కు చెందిన నిక్కీ 1.30%, కొరియా కోస్పి 1.32% చొప్పున పెరిగాయి. చైనా షాంఘై కాంపోజిట్ ఇండెక్స్ 0.11 శాతం క్షీణతతో ముగిసింది.
  • నవంబర్ 22న, US డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ 0.97% పెరిగి 44,296కి మరియు S&P 500 0.35% పెరిగి 5,969కి చేరుకుంది. నాస్‌డాక్ కూడా 0.16% పెరిగి 19,003కి చేరుకుంది.
  • NSE డేటా ప్రకారం, విదేశీ పెట్టుబడిదారులు (FIIలు) నవంబర్ 22న ₹1,278.37 కోట్ల విలువైన షేర్లను విక్రయించారు. ఈ కాలంలో, దేశీయ పెట్టుబడిదారులు (DIIలు) ₹ 1,722.15 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేశారు.

Stock Market News: సోమవారం సెన్సెక్స్, నిఫ్టీ కంపెనీల షేర్ల కదలికలు ఇలా.. 

సెన్సెక్స్ 30లో 26 షేర్లు లాభాలలో ముగిశాయి. ఎల్ అండ్ టీ , ఎస్బీఐ, అదానీ పోర్ట్స్, HDFC బ్యాంక్, ICICI బ్యాంక్ షేర్లు లాభాలను చూశాయి. ఆయిల్ అండ్ గ్యాస్, ఎనర్జీ, రియాల్టీ, ఫైనాన్షియల్ సర్వీసెస్ రంగాల షేర్లు బీఎస్ఈలో లాభాలను తెచ్చాయి. అదేవిధంగా మిడ్ క్యాప్ ఇండెక్స్ 2 శాతం, స్మాల్ క్యాప్ ఇండెక్స్ 1.5 శాతం పెరిగాయి. 

ఇటీవల అమెరికా కేసు నేపథ్యంలో ఒడిదుడుకుల్లో పడిన అదానీ గ్రూప్ కంపెనీల షేర్ల విషయానికి వస్తే.. ఈ గ్రూప్ కంపెనీలు పదికి ఐదు కంపెనీల షేర్లు లాభాల్లో నిలిచాయి. అదానీ పోర్ట్స్, ఏసీసీ, అదానీ ఏంటర్ప్రైజెస్, అదానీ విల్మార్, అంబుజా సిమెంట్స్ లాభాల్లో ట్రేడ్ అవగా.. అదానీ గ్రీన్ ఎనర్జీ, అదానీ ఎనర్జీ సొల్యూషన్స్, అదానీ పవర్, ఎన్డీటీవీ, అదానీ టోటల్ గ్యాస్ నష్టాలను చూశాయి. 

ALSO READ  Health Tips: పళ్లు తోముకునే ముందు నీళ్లు తాగడం వల్ల ఎన్నో ప్రయోజనాలు!

సోమవారం నాటి ట్రెండ్ తో చూసుకుంటే.. ఈరోజు కూడా స్టాక్ మార్కెట్ లాభాల బాటలోనే ఉండవచ్చని నిపుణులు భావిస్తున్నారు. వివిధ బిజినెస్ వెబ్సైట్స్ లో నిపుణుల విశ్లేషణల ప్రకారం ఈరోజు మార్కెట్లు పాజిటివ్ గానే ఉంటాయి. మింట్ లో సుమీత్ బాగాడియా రికమెండేషన్స్ పరిశీలిస్తే.. ఫెడరల్ బ్యాంక్ లిమిటెడ్, DOMS ఇండస్ట్రీస్ లిమిటెడ్ స్టాక్స్ కొనుగోలు చేయవచ్చు. అలాగే, గణేష్ డోంగ్రే అంచనా ప్రకారం సిప్లా లిమిటెడ్, పెట్రోనెట్ ఎల్‌ఎన్‌జి లిమిటెడ్, కంటైనర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ స్టాక్స్ కొనడం కోసం పరిగణనలోకి తీసుకోవచ్చు. 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *