Siddipet: సిద్దిపేట నియోజకవర్గ పరిధిలో వ్యవసాయ మార్కెట్ కమిటీల పీఠం ఎవరికి దక్కుతుందోనన్న చర్చ జోరుగా సాగుతోంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన పదేళ్ల తరువాత సిద్దిపేట జిల్లా నియోజకవర్గ పరిధిలోని వ్యవసాయ మార్కెట్ కమిటీలు అన్నీ కాంగ్రెస్ నేతల చేతుల్లోకి వచ్చాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటుతో క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న నాయకులకు కొత్త ఆశలు చిగురించాయి. రాష్ట్రంలో ఉన్న అన్ని కార్పొరేషన్లు, నామినేటెడ్ పదవులను ప్రభుత్వం ఇప్పటికే రద్దు చేసి కొత్తవారిని నియమించింది.
వీటితో పాటు మార్కెట్ కమిటీలను సైతం రద్దు చేసి కొన్నిటికి కొత్తవారిని నియమించింది. తెలంగాణలో తమ పార్టీ అధికారంలోకి రావడంతో ఇకపై తమకు దక్కాల్సిన నామినేటేడ్ పదవులపై కాంగ్రెస్ నేతలు దృష్టి సారించారు. మార్కెట్ కమిటీలు, పంచాయతీ, మండల స్థాయిలో ఉండే ప్రొటోకాల్ పదవులపై కాంగ్రెస్ నేతలు దృష్టి సారించే ఇప్పటికే కొన్ని నామినేటెడ్ పదవులు కైవసం చేసుకున్నారు. కాంగ్రెస్ అధికారంలో లేని పదేళ్ల కాలం పాటు కష్టకాలంలో కూడా పని చేశామని.. ఇప్పుడు అధికారంలోకి వచ్చింది కాబట్టి నామినేటేడ్ పదవులతో తమకు న్యాయం చేయాలని కాంగ్రెస్ నాయకులు పార్టీ పెద్దల వద్ద తమ వాదనలను వినిపించేందుకు సిద్ధమయ్యారు.
ఇది కూడా చదవండి: MLC Kavitha: KTR అరెస్ట్..! యాక్షన్ లోకి కవిత
సిద్దిపేటలో వ్యవసాయ మార్కెట్ కమిటీలో పోస్టులు దక్కించుకునేందుకు ఎవరికి వారుగా పైరవీలు ప్రారంభించి ప్రయత్నిస్తున్నారు. సిద్దిపేట, చిన్నకోడూరు, నంగునూరు తదితర వ్యవసాయ మార్కెట్ యార్డులు ఉన్నాయి. ఈ మార్కెట్ కమిటీ పరిధిలో ఉన్న ఆయా మండలాల్లోని కాంగ్రెస్ నేతలు చైర్మన్‌లు, వైస్ చైర్మన్, డైరెక్టర్ల పదవులు దక్కించుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అయితే మార్కెట్ కమిటీ చైర్మన్‌ల యోగం ఎవరిని వరిస్తోందోనని స్థానికులు, నాయకులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఇదిలా ఉంటే అధికార పార్టీ ద్వితీయ నేతలంతా పదవిపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. పేరుతో పాటు ఆదాయం బాగా ఉండే పోస్ట్ ,కావడంతో ఆశావహుల సంఖ్య ఎక్కువగానే ఉంది. మహిళా రిజర్వేషన్ కావండంతో సిద్దిపేట మార్కెట్ యార్డు చైర్మన్ పదవికి తీవ్ర పోటీ జరుగుతుందని చెప్పవచ్చు.
సిద్దిపేట ఏఎంసీ చైర్మన్ పదవి ఆశిస్తున్న ఆశావాహులు ఎందరో కానీ చివరికి అదృష్టం ఎవరికి వర్తిస్తుందని అందరూ చూస్తున్నారు. దీంతో చాలామంది పోటీ పడుతున్నారు. ఎమ్మెల్సీ చైర్మన్ పదవి కోసం పూజల గోపికృష్ణ లిఖిత, షబానా అతు ఇమామ్, బొమ్మల యాదగిరి అన్నపూర్ణ, చందు రెడ్డి సుమలత తిరుపతిరెడ్డి, ముద్దం లక్ష్మిరెడ్డి, నాయిని శ్రావణి రెడ్డి, వీరితోపాటు లక్కరుసు సూర్య వర్మ వీరందరూ సతీమణులకు ఇప్పించుకోవడానికి తీవ్రంగానే ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం. వీరితో పాటు మరికొందరు కూడా పదవి ఆశిస్తున్నారు.
ఒక్క మాటలో చెప్పాలంటే సిద్దిపేట చైర్మన్ పోస్ట్ కోసం తీవ్రంగానే పోటీ ఉందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఉన్నది ఒకటే పోస్టుగాని ఆశావాహులు ఎక్కువయ్యారు. ఆశిస్తున్న వారందరూ పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, తూర్పు జయప్రకాశ్ రెడ్డి, మైనంపల్లి హనుమంతరావు ద్వారా ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తుంది.
ఇది కూడా చదవండి: MLC Kavitha: పొలిటికల్‌గా ఎమ్మెల్సీ కవిత రీ ఎంట్రీ
ఇదిలా ఉంటే పూజల గోపికృష్ణ లికిత ఇతను ఇతను కూడా రాజకీయాల్లో చురుగ్గా పాల్గొంటూ తన దినముద్ర వేసుకున్నారు. ఇతను స్వయాన పూజల హరికృష్ణ సిద్దిపేట ఇంచార్జ్ తమ్ముడు. ఈ పదవి తనకే వస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇది ఇలా ఉంటే నియోజవర్గంలో చిన్న కోడూరు ఏఎంసీ మార్కెట్ చైర్మన్‌కు మీసం మహేందర్, మంద పాండు, చల్ల అజ్జు యాదవ్ ఈ పదవి ఆశిస్తున్నట్టు తెలుస్తుంది. నంగునూరు మండల ఏఎంసీ చైర్మన్‌కు దేవులపల్లి యాదగిరి పేరు దాదాపుగా ఖరారైనట్లుగా తెలుస్తుంది.
ఇదిలా ఉంటే ఇప్పుడు సిద్దిపేటలో అంత ఒకటే చర్చ నామినేటెడ్ పోస్టులు కష్టపడ్డవాళ్ళక లేక డబ్బులు ఉన్నవాళ్లకా లేక బ్యాక్ గ్రౌండ్ ఉన్న వారికే పోస్టులు వస్తాయని సిద్దిపేటలో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్‌గా మారింది.