Karun Nair: ఇంగ్లాండ్ పర్యటనలోని తొలి టెస్ట్ మ్యాచ్‌లో టీమ్ ఇండియా ఓటమి ఎదురైంది. కానీ ఈ మ్యాచ్‌లో భారత బ్యాట్స్‌మెన్ అద్భుతమైన ప్రదర్శన ఇచ్చారు. మొత్తం మీద ఆ మ్యాచ్‌లో టీమిండియా 5 సెంచరీలు సాధించింది. అయితే, ఆ జట్టు పేలవమైన ఫీల్డింగ్, బౌలింగ్ కారణంగా ఓటమి పాలైంది. ఇప్పుడు దాదాపు టీం ఇండియా బ్యాట్స్‌మెన్ అందరూ సిరీస్‌లోని రెండవ మ్యాచ్‌లో కూడా తమ వంతు సహకారం అందించారు. కానీ రెండు మ్యాచ్‌లలో ఒక్క బ్యాట్స్‌మన్ మాత్రమే పరుగులు సాధించలేకపోయాడు. ఆ వ్యక్తి మరెవరో కాదు, 8 ఏళ్ల తర్వాత భారత జట్టులో అవకాశం పొందిన కరుణ్ నాయర్.
కరుణ్ నాయర్ తన ఇంగ్లాండ్ పర్యటన సందర్భంగా తరచుగా వార్తల్లో నిలుస్తున్నాడు. కానీ అతను తన అద్భుతమైన ప్రదర్శనల వల్ల కాదు, పేలవమైన ప్రదర్శన కారణంగా నిలుస్తున్నాడు. ఇంగ్లాండ్ పర్యటనలోని మొదటి రెండు మ్యాచ్‌లలో ఆడే అవకాశం పొందిన కరుణ్, ఈ మ్యాచ్‌లలో నాలుగు ఇన్నింగ్స్‌లలో పరుగులు సాధించడంలో విఫలమయ్యాడు. దీంతో అతడి భవిష్యత్తు గురించి ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇది అతడికి చివరి అవకాశమా లేదా జట్టు యాజమాన్యం మరిన్ని అవకాశాలు ఇస్తుందా? అనేది ఉత్కంఠగా మారింది. అయితే కరుణ్ ప్రదర్శన చూస్తుంటే.. అతనికి మూడో మ్యాచ్‌లో అవకాశం లభించడం కష్టమని తెలుస్తోంది.
బర్మింగ్‌హామ్‌లో ఇంగ్లాండ్‌తో జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్‌లో కరుణ్ నాయర్‌కు మూడో స్థానంలో బ్యాటింగ్ చేసే అవకాశం లభించింది. అయితే ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాడు. మొదటి ఇన్నింగ్స్‌లో కేవలం 31 పరుగులు చేసి అతను పెవిలియన్ చేరాడు. దీంతో పాటు కరుణ్ రెండో ఇన్నింగ్స్ లో కూడా 26 పరుగులు చేసి ఔటయ్యాడు. దీనికి ముందు తొలి టెస్ట్ మ్యాచ్‌లో కరుణ్ అంతగా రాణించలేదు.
8 ఏళ్ల తర్వాత అవకాశం
ఇదే కరుణ్ నాయర్ 2016లో ఇంగ్లాండ్‌పై ట్రిపుల్ సెంచరీ చేసి చరిత్ర సృష్టించాడు. కానీ దీని తర్వాత అతని అంతర్జాతీయ కెరీర్ గాడి తప్పింది. ఇప్పుడు దేశవాళీ క్రికెట్‌లో అతని అద్భుతమైన ప్రదర్శన ఆధారంగా ఇంగ్లాండ్ పర్యటనకు జట్టులో చోటు దక్కింది. కానీ అతడు మాత్రం ఆశించినంత ఆడలేకపోతున్నాడు. నాయర్‌కు మరిన్ని అవకాశాలు ఇవ్వాలా లేక యువ ప్రతిభను ప్రయత్నించాలా అనే దానిపై టీమ్ ఇండియా ఇప్పుడు కఠినమైన నిర్ణయం తీసుకోవలసి ఉంటుంది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వంటి అనుభవజ్ఞులు టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్ కావడంతో, జట్టుకు మిడిలార్డర్‌లో స్థిరత్వం అవసరం. నాయర్ అనుభవం జట్టుకు ప్రయోజనకరంగా ఉండవచ్చు, కానీ అతని ఫామ్ జట్టుకు పెద్ద ఆందోళన కలిగిస్తుంది.
ఇది కూడా చదవండి:
Shubman Gill: బ్రాడ్‌మాన్ రికార్డును గిల్ బద్దలు కొడతాడా..? ఇంకా ఎన్ని రన్స్ కావాలంటే..?
Shubman Gill: కోహ్లీ వారసుడు వచ్చేశాడు.. అన్ని రికార్డులు బద్దలవడం ఖాయం
Jamie Smith: చరిత్ర సృష్టించిన ఇంగ్లాండ్ వికెట్ కీపర్ జామీ స్మిత్