Jamie Smith: భారత్‌తో జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ వికెట్ కీపర్ జామీ స్మిత్ చరిత్ర సృష్టించాడు. 14 సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత, భారత్‌పై సెంచరీ చేసిన తొలి ఇంగ్లాండ్ వికెట్ కీపర్‌గా నిలిచాడు. ఐదు టెస్టుల ఆండర్సన్-సచిన్ ట్రోఫీలో భాగంగా ఎడ్జ్‌బాస్టన్‌లో జరుగుతున్న రెండో టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో జామీ స్మిత్ సెంచరీ సాధించాడు. కేవలం 80 బంతుల్లోనే జేమీ స్మిత్ సెంచరీ మార్కును చేరుకున్నాడు. ఈ సెంచరీతో, జామీ స్మిత్ తన పేరుతో అనేక రికార్డులను లిఖించాడు.
ఇంగ్లాండ్ వికెట్ కీపర్ జామీ స్మిత్ 14 సంవత్సరాల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత భారత్‌పై టెస్ట్ సెంచరీ సాధించాడు. వికెట్ కీపర్ మాట్ ప్రియర్ (103 నాటౌట్) 2011లో లార్డ్స్‌లో భారత్‌పై సెంచరీ చేసిన చివరి వికెట్ కీపర్. ఇప్పటివరకు, నలుగురు ఇంగ్లాండ్ వికెట్ కీపర్లు మాత్రమే భారత్‌పై టెస్ట్ సెంచరీలు చేశారు. 1952లో లార్డ్స్‌లో ఇంగ్లాండ్ వికెట్ కీపర్‌గా గాడ్‌ఫ్రే ఎవాన్స్ (104) భారత్‌పై సెంచరీ చేశాడు. 1996లో లార్డ్స్‌లో జాక్ రస్సెల్ (124) సెంచరీ చేశాడు.
ఇది కూడా చదవండి: Double Centuries: టెస్ట్, వన్డేల్లో డబుల్ సెంచరీలు సాధించిన ఐదుగురు ఆటగాళ్లు వీళ్లే!
ఇంగ్లాండ్ తరఫున టెస్ట్ క్రికెట్‌లో అత్యంత వేగవంతమైన సెంచరీ చేసిన నాల్గవ బ్యాట్స్‌మన్‌గా జామీ స్మిత్ నిలిచాడు, హ్యారీ బ్రూక్ రికార్డును సమం చేశాడు. గిల్బర్ట్ జెస్సోప్ ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉన్నాడు. 1902లో ఆస్ట్రేలియాపై 76 బంతుల్లో సెంచరీ చేశాడు. 2002లో న్యూజిలాండ్‌పై జానీ బెయిర్‌స్టో 77 బంతుల్లో సెంచరీ చేశాడు. 2022లో పాకిస్థాన్‌పై హ్యారీ బ్రూక్ 80 బంతుల్లో సెంచరీ చేశాడు. 2015లో న్యూజిలాండ్‌పై బెన్ స్టోక్స్ 85 బంతుల్లో సెంచరీ చేశాడు.