Sankranthiki Vasthunnam

Sankranthiki Vasthunnam: ఊరుఊరంతా ‘సంక్రాంతికి వస్తున్నాం’ చూసేసింది!

Sankranthiki Vasthunnam: సంక్రాంతి సినిమాలు ఇలా విడుదలయ్యాయో లేదో అలా పైరసీ అయిపోయాయి. ‘గేమ్ ఛేంజర్’ మూవీని రిలీజ్ అయిన కొద్దిగంటల్లోనే సోషల్ మీడియాలో పెట్టేశారు. అలానే ప్రైవేట్ బసుల్లో ప్రదర్శించారు. ఆ తర్వాత రెండు రోజులకు వచ్చిన ‘డాకు మహారాజ్’ హెచ్.డి. ప్రింట్ సైతం మూవీ రిలీజ్ అయిన మర్నాడే వచ్చేసింది. ఇక ‘సంక్రాంతికి వస్తున్నాం’ పరిస్థితి వేరేగా ఉంది. ఈ సినిమా పైరసీ ప్రింట్ కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దాని కంటే దారుణం ఏమంటే… ఇటీవల ఓ గ్రామంలో ఈ సినిమాను బహిరంగంగా చౌరస్తాలో ప్రదర్శించారు. ఊళ్ళోని జనాలంతా ఎంచక్కా… ఉచితంగా దానిని వీక్షించేశారు. తొలివారంలో రూ. 203 కోట్ల గ్రాస్ ను వసూలు చేసిన ఈ సినిమా కలెక్షన్లపై ఖచ్చితంగా ఆ సామూహిక వీక్షణం తాలుకూ ప్రభావం ఉంటుంది. ఇలాంటి వ్యవహారంపై అలక్ష్యం చేయకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సినిమా అభిమానులు కోరుతున్నారు.

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  The Family Man 3: ‘ది ఫ్యామిలీ మ్యాన్’ 3’ షూటింగ్ పూర్తి!?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *