Sukumar: దిల్ రాజు సోదరుడు శిరీష్ తనయుడు ఆశిష్ రెడ్డి కొంతకాలంగా హీరోగా నిలబడేందుకు తీవ్ర ప్రయత్నం చేస్తున్నాడు. అతని తొలి చిత్రం ‘రౌడీ బాయ్స్’ ఫర్వాలేదనిపించినా, ఎన్నో ఆశలు పెట్టుకున్న ‘లవ్ మీ’ మూవీ పరాజయం పాలైంది. కీరవాణి లాంటి సీనియర్ సంగీత దర్శకుడు సైతం ఈ మూవీని గట్టెక్కించలేక పోయాడు. అయితే ‘లవ్ మీ’ కంటే ముందే ఆశిష్ రెడ్డి హీరోగా దిల్ రాజు, సుకుమార్ తో కలిసి ‘సెల్ఫిష్’ అనే మూవీని ప్రారంభించాడు. దీనికి సుకుమార్ శిష్యుడు కాశీ విశాల్ దర్శకుడు. కారణాలు ఏవైనా ఈ సినిమా విడుదలలో తీవ్ర జాప్యం జరిగింది.
Sukumar: దాదాపుగా షూటింగ్ పూర్తి అయిన ఈ సినిమా అనుకున్న స్థాయిలో రావడం లేదని దిల్ రాజు భావించినట్టు వార్తలు వచ్చాయి. అయితే… ఇప్పుడీ చిత్రాన్ని చక్కదిద్దే బాధ్యతలను సుకుమార్ కు దిల్ రాజు అప్పగించినట్టు తెలుస్తోంది. ఇంతవరకూ అయినా షూటింగ్ ను చెక్ చేసి, ఏ యే అంశాలను కలిపితే బెటర్ గా ఉంటుందో చూడమని సుక్కును దిల్ రాజు కోరారట. సుకుమార్ సైతం ఈ చిత్ర నిర్మాణంలో భాగస్వామి కాబట్టి తనవంతు ప్రయత్నం చేస్తానని హామీ ఇచ్చారట. ఆ రకంగా మరమత్తులు చేసి అతి త్వరలోనే ‘సెల్ఫిష్’ను జనం ముందుకు తీసుకొస్తారని అంటున్నారు.