Indian Army: జమ్ము కశ్మీర్‌లో ఈ ఏడాది ఇప్పటివరకు భద్రతా బలగాలు 75 మంది ఉగ్రవాదులను హతమార్చాయి. ఆ ఉగ్రవాదుల్లో 60 శాతం పాకిస్థాన్‌కు చెందినవారేనని ఆర్మీ అధికారులు ప్రకటించారు. ఈ ఏడాదిలో ప్రతి ఐదు రోజులకు ఒక ఉగ్రవాదిని మట్టుబెట్టడం జరిగిందని, మొత్తం 75 మంది ఉగ్రవాదులను భద్రతా బలగాలు హతమార్చాయన్నారు.
ప్రధాన ఎన్‌కౌంటర్ల వివరాలు:
నియంత్రణ రేఖ (LoC) అంతర్జాతీయ సరిహద్దు (IB) దగ్గర 17 మంది ఉగ్రవాదులను హతమార్చారు. జమ్ము కశ్మీర్ అంతర్గత ప్రాంతాల్లో 26 మంది ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి.
జమ్ము ప్రాంతంలోని ఐదు జిల్లాలు—జమ్ము, ఉధంపూర్, కథువా, దోడా, రాజౌరిలో మరణించిన 42 మంది ఉగ్రవాదుల్లో ఎక్కువ శాతం స్థానికేతర ఉగ్రవాదులు ఉన్నట్లు డేటా వెల్లడించింది.
కశ్మీర్ లోయలోని బారాముల్లా, బందిపొరా, కుప్వారా, కుల్గాం జిల్లాల్లో విదేశీ ఉగ్రవాదులను భద్రతా బలగాలు హతమార్చాయి.
జమ్ముకశ్మీర్‌లోని తొమ్మిది జిల్లాల్లో బారాముల్లాలో అత్యధికంగా తొమ్మిది ఎన్‌కౌంటర్లలో 14 మంది స్థానికేతర ఉగ్రవాదులు హతమయ్యారు.
బారాముల్లాలో అత్యధికంగా ఉరీ సెక్టార్‌లోని సబురా నాలా, కమల్‌కోట్, చక్ తప్పర్ క్రిరి, నౌపోరా, హడిపొర, సాగిపోరా, వాటర్‌గామ్, రాజ్‌పూర్ వంటి ప్రాంతాల్లో ఉగ్రవాదులను భద్రతా బలగాలుహతమార్చాయి.