Whats App: వచ్చే ఏడాది జనవరి నుంచి కొన్ని మొబైల్ ఫోన్లలో వాట్సాప్ సేవలు బంద్ కానున్నాయి. పాత ఆపరేటింగ్ సిస్టమ్ ఉన్న మొబైల్ ఫోన్లలో వాట్సాప్ పనిచేయదని మెటా సంస్థ ప్రకటించింది. ఎందుకంటే ఈ ఫోన్లు వాట్సాప్ కొత్త ఫీచర్లకు మద్దతు ఇవ్వవు. వాట్సాప్ ద్వారా ఏఐతో సహా అనేక కొత్త ఫీచర్లు అందుబాటులోకి వస్తున్నాయి. అందుకే వాట్సాప్ పాత స్మార్ట్‌పోన్లకు మద్దతును నిలిపివేస్తున్నది.
Whats App: ఈ జాబితాలో శాంసంగ్ గెలాక్సీలో నోట్ 2, ఎస్3, ఎస్4 మినీ, మోటరోలాలో మోటా జీ1, రేజర్ హెచ్‌డీ, మోటో ఈ2014, హెచ్‌టీసీలో వన్ ఎక్స్, వన్ ఎక్స్ ప్లస్, డిజైర్ 500, డిజైర్ 601, ఎల్జీలో ఆప్టిమస్ జీ, నెక్సస్ 4, జీ2 మినీ, ఎల్ 90, డివైజ్ తదితర ఫోన్లు ఉన్నాయి. యూజర్లకు కొత్త తరహా ఫీచర్లను అందించడంతోపాటు భద్రతాపరంగానూ వాట్సాప్ ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటూ ఉన్నది.