Allu Arjun Enquiry: సంధ్య ధియేటర్ కేసు విషయంలో చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ అల్లు అర్జున్ ని విచారించిన పోలీసుల. దాదాపు రెండున్నర గంటలు సేపు జరిగిన విచారణ ముగిసింది. మరికొద్దిసేపట్లో పోలీస్ స్టేషన్ నుండి నివాసానికి బయలుదేరాను నా అల్లు అర్జున్.
సంధ్య థియేటర్ కేసు విషయం లో చిక్కడపల్లి పోలీస్ అల్లు అర్జున్ కి నోటీసులు పంపించారు. దింతో ఈరోజు ఉదయం 11 గంటలకు అల్లు అర్జున్ విచారణ కోసం చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ హాజరుఅయ్యారు. తన తో త్రండి అల్లు అరవింద్ ,మామ చంద్రశేఖర్ పోలీస్ స్టేషన్ వద్దకు వచ్చారు.వాళ్లతో పాటు లాయర్ నికూడా తెచ్చుకున్నారు.
పోలీస్ స్టేషన్ లోకి వెళ్లిన అల్లు అర్జున్ ని ప్రత్యేక గదిలో ఏసీపీ రమేష్ కుమార్, సెంట్రల్ జోన్ డీసీపీలు విచారించారు.న్యాయవాది అశోక్ రెడ్డి సమక్షంలోకొనసాగిన విచారణ. అల్లు అర్జున్ స్టేట్మెంట్ను రికార్డు చేసిన పోలీసులు. 50కి పైగా ప్రశ్నల్ని అల్లు అర్జున్ ముందు ఉంచిన పోలీసులు. ఒక్కనొక సమయంలో సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేయాలి అని పోలీసులు అనుకున్నారు.
- సంధ్య థియేటర్‌కు వచ్చేప్పుడు ఎవరి అనుమతి తీసుకున్నారు?
- పోలీసులు అనుమతి ఇచ్చారని మీకు ఎవరు చెప్పారు?
- పోలీసులు అనుమతి నిరాకరించినట్లు మీకు సమాచారం ఇచ్చారా? లేదా?
- తొక్కసలాటలో రేవతి చనిపోయినట్లు థియేటర్లో ఉన్నప్పుడు తెలిసిందా? లేదా?
- మీడియా ముందు ఎవరూ చెప్పలేదని ఎందుకు చెప్పారు?
- రోడ్ షోకు అనుమతి తీసుకున్నారా? లేదా?
- అనుమతి లేకుండా రోడ్ షో ఎలా నిర్వహించారు?
- మీ కుటుంబ సభ్యులు ఎవరెవరు థియేటర్‌కు వచ్చారు?
- మీతో వచ్చిన బౌన్సర్లు ఏ ఏజెన్సీకి సంబంధించిన వారు?
- ఎంతమంది బౌన్సర్లను మీరు నియమించుకున్నారు?
- అభిమానులు, పోలీసుల మీద దాడి చేసిన బౌన్సర్లు ఎవరు?
- వీటితో పాటు మరికొన్ని ప్రశ్నలు కూడా ఉన్నట్టు తెలుస్తోంది.
- సంధ్య థియేటర్ యాజమాన్యం ముందుగానే థియేటర్ కు రావొద్దని చెప్పిందా?
- * పోలీసులు అనుమతి ఇవ్వలేదని మీకు తెలుసా?
- * సంధ్య థియేటర్‌లో ప్రీమియర్ షోకి రావడానికి మీరు అనుమతి తీసుకున్నారా? దాని కాపీ మీ దగ్గర ఉందా?
- * మీరు లేదా మీ PR టీమ్ పోలీసుల నుంచి పర్మిషన్ తీసుకున్నారా?
- * సంధ్య థియేటర్ దగ్గర పరిస్థితిని మీ పీఆర్ టీమ్ మీకు ముందే వివరించారా?
సంధ్య థియేటర్ లో రాత్రి 9.30 గంటల నుంచి బయటకి వెళ్లే వరకు ఏం జరిగింది అనే దాని కూడా ప్రశ్నించారు. తొక్కిసలాటలో రేవతి చనిపోయిన విషయం మీకు తెలుసు కదా అని ప్రశ్నించిన పోలీసులు దానికి సమాధానం చెప్పకుండా సైలెంట్‌గా గ ఉన్నారు. తర్వాత రోజు వరకు తనకు తెలియదని మీడియాకు ఎందుకు చెప్పారని ప్రశ్నించిన పోలీసులు.. ఈ ప్రశ్నకు కూడా సైలెంట్‌గానే ఉన్న అల్లు అర్జున్.