Weekly Horoscope:
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం)
ఈ వారం మీకు సానుకూల ఫలితాలు అందుతాయి. పెట్టుబడుల విషయంలో తొందరపాటు వద్దు, లోతుగా ఆలోచించి అడుగు వేయండి. మిత్రుల సలహాలు మీకు శ్రీరామరక్ష. ఉద్యోగంలో మీ ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది. సరైన ప్రణాళికతో ఒత్తిడిని జయిస్తారు. వారాంతంలో మీకు రావాల్సిన గౌరవం, గుర్తింపు దక్కుతాయి.
-
పరిహారం: నవగ్రహ శ్లోకాలు పఠించండి.
వృషభం (కృత్తిక 2,3,4 పాదాలు; రోహిణి, మృగశిర 1,2 పాదాలు)
మీకు అత్యుత్తమ కాలం నడుస్తోంది. వ్యాపారస్తులకు లాభాలు గడిస్తారు. కొన్నిసార్లు ధైర్యంగా నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. మీ కష్టానికి తగిన ఫలితం దక్కుతుంది. ఆర్థికంగా పురోగతి సాధిస్తారు. కాలాన్ని వృథా చేయకుండా ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగండి. వారం మధ్యలో అదృష్టం వరిస్తుంది.
-
పరిహారం: లక్ష్మీదేవి ఆరాధన శుభప్రదం.
మిథునం (మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు)
ఇంటా బయటా శుభ పరిణామాలు ఎదురవుతాయి. ఉద్యోగులకు ‘లాభ సూర్యయోగం’ వల్ల పదోన్నతి కలిగే అవకాశం ఉంది. మీ ప్రతిభకు అధికారుల నుండి ప్రశంసలు అందుతాయి. ఆర్థికంగా మిశ్రమ ఫలితాలు ఉంటాయి. పెట్టుబడుల విషయంలో ఆచితూచి వ్యవహరించండి.
-
పరిహారం: మహాలక్ష్మిని పూజించండి.
కర్కాటకం (పునర్వసు 4వ పాదం; పుష్యమి, ఆశ్లేష)
ఉద్యోగస్తులకు ఈ వారం మేలు జరుగుతుంది. మీ కృషికి తగిన గుర్తింపు లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ముఖ్యమైన విషయాల్లో ఇతరుల మీద ఆధారపడకుండా సొంత నిర్ణయాలు తీసుకోండి. వారం మధ్యలో పాత సమస్యలన్నీ తొలగిపోయి పరిస్థితులు అనుకూలిస్తాయి.
-
పరిహారం: నవగ్రహ శ్లోకాలను పఠించండి.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం)
దైవబలంతో పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. అనవసరపు వ్యవహారాలకు దూరంగా ఉండండి. వ్యాపారంలో నష్టాలను సమయస్ఫూర్తితో అధిగమిస్తారు. మీపై అసూయపడే వారితో జాగ్రత్తగా ఉండండి. ఒంటరి పోరాటం కంటే కుటుంబ సభ్యుల మద్దతుతో నిర్ణయాలు తీసుకోవడం ఉత్తమం.
-
పరిహారం: నవగ్రహ దర్శనం చేసుకోండి.
కన్య (ఉత్తర 2, 3, 4 పాదాలు; హస్త, చిత్త 1, 2 పాదాలు)
మనోబలంతో కార్యాచరణ ప్రారంభించండి. వచ్చే అవకాశాలను జారవిడుచుకోవద్దు. మాట తీరులో స్పష్టత ఉండాలి, వివాదాలకు దూరంగా ఉండండి. మీ కోరికలు నెరవేరుతాయి. ‘శుక్రయోగం’ కారణంగా ఆర్థికంగా బలం చేకూరుతుంది. సంపాదించిన దానిని భవిష్యత్తు కోసం పొదుపు చేయండి.
-
పరిహారం: నవగ్రహ ధ్యానం మేలు చేస్తుంది.
తుల (చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు)
మీకు అద్భుతమైన కాలం. పట్టిందల్లా బంగారం అవుతుంది. వ్యాపారంలో భారీ లాభాలు ఉంటాయి. కొత్త ఆలోచనలతో ముందుకు సాగుతారు. ఆర్థిక ప్రయోజనాలు మెండుగా ఉన్నాయి. సమాజంలో గౌరవం, ఉద్యోగంలో గుర్తింపు లభిస్తాయి. భూ లాభం సూచితం.
-
పరిహారం: మహాలక్ష్మిని స్మరించండి.
వృశ్చికం (విశాఖ 4వ పాదం; అనూరాధ, జ్యేష్ఠ)
ఉద్యోగంలో అత్యుత్తమ ఫలితాలు ఉంటాయి. ఆత్మవిశ్వాసంతో లక్ష్యాలను చేరుకుంటారు. వ్యాపారంలో స్వల్ప ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంది, కాబట్టి సొంతంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. కుటుంబ సభ్యుల నుండి సహకారం లభిస్తుంది. ఒక శుభవార్త మీ ఇంట్లో ఆనందాన్ని నింపుతుంది.
-
పరిహారం: ఈశ్వరుడిని ధ్యానించండి.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం)
మీరు ఆశించిన ఫలితాలను సాధిస్తారు. లక్ష్య సాధనలో పట్టుదల అవసరం. వ్యాపార విజయాలు వరిస్తాయి. తోటివారి సహకారం అందుతుంది. శక్తికి మించిన బాధ్యతలను నెత్తిన వేసుకోకండి. వాయిదా వేసే మనస్తత్వాన్ని వదిలితే అనుకున్నవి త్వరగా పూర్తవుతాయి.
-
పరిహారం: విష్ణు సహస్రనామ పారాయణ చేయండి.
మకరం (ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు; శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు)
ఆదాయ మార్గాలు మెరుగుపడతాయి. క్లిష్ట పరిస్థితుల్లో బుద్ధిబలంతో వ్యవహరించండి. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. మీ పని తీరుకు పెద్దల ప్రశంసలు అందుతాయి. ప్రయాణాల్లో అప్రమత్తంగా ఉండండి. వ్యాపారంలో ఓర్పు చాలా అవసరం.
-
పరిహారం: సూర్యనారాయణ మూర్తిని ఉపాసించండి.
కుంభం (ధనిష్ట 3, 4 పాదాలు; శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాలు)
మీకు కాలం అనుకూలంగా ఉంది. భవిష్యత్తుకు సంబంధించిన నిర్ణయాలు సఫలమవుతాయి. ఉద్యోగంలో పురోగతి ఉంటుంది. ఆర్థికంగా స్థితిగతులు బాగుంటాయి. సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. కుటుంబంతో సంతోషంగా గడుపుతారు.
-
పరిహారం: లక్ష్మీ అష్టోత్తరం పఠించండి.
మీనం (పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి)
మనోబలంతో నిర్ణయాలు తీసుకోండి. చిన్నపాటి ఆటంకాలు ఎదురైనా వెనకడుగు వేయవద్దు. వృత్తి, వ్యాపారాల్లో ఎదిగేందుకు కొత్త అవకాశాలు వస్తాయి. ఇతరుల ప్రవర్తన చికాకు కలిగించినా సహనంతో వ్యవహరించండి. వారం మధ్యలో శుభవార్త వింటారు.
-
పరిహారం: ఆంజనేయ స్వామిని దర్శించుకోండి.
