Vishwak Sen: మాస్ కా దాస్ విశ్వక్ సేన్ నటిస్తున్న ‘లైలా’ వాలెంటైన్స్ డే కానుకగా ఫిబ్రవరి 14న విడుదల కాబోతోంది. క్రిస్మస్ సందర్భంగా ఈ మూవీ నుండి విశ్వక్ సేన్ ఫస్ట్ లుక్ పోస్టర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఇందులో విశ్వక్ సేన్ స్టైలిష్, రిచ్ అవతార్‌లో కనిపించారు. మోడరన్ అవుట్ ఫిట్ లో స్పోర్టింగ్ షేడ్స్, గోల్డ్ యాక్ససరీస్ ధరించి కూల్ అండ్ కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. మెడపై పచ్చబొట్టు, చేతులపై “సోను లవర్”, సోను కిల్లర్” అని రాసి ఉన్న టాటూలతో సినిమాలోని మెయిన్ పాయింట్ ఏమై ఉండొచ్చనే ఆలోచనను రేకెక్తిస్తున్నాడు.
ఇది కూడా చదవండి: Narendra Modi: మంచినీటి పథకాల ఘనత అంబేద్కర్ కే చెందుతుంది ప్రధాని మోదీ
రామ్ నారాయణ్ దర్శకత్వంలో ఈ మూవీని సాహు గారపాటి నిర్మిస్తున్నారు. ఆకాంక్ష శర్మ హీరోయిన్ గా పరిచయం కాబోతున్న ఈ సినిమాకు లియోన్ జేమ్స్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాలో విశ్వక్ సేన్ లేడీ గెటప్ లో కనిపిస్తుండటం విశేషం.