Parliament: ఢిల్లీలోని కొత్త పార్లమెంటు భవనం సమీపంలోని రైల్వే భవనం ఎదుట ఓ వ్యక్తి నిప్పంటించుకుని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉన్నట్టు డాక్టర్స్ చెబుతున్నారు. అతనికి 95% కాలిన గాయాలయ్యాయని వారు చెప్పారు. ఢిల్లీ ఫైర్ సర్వీస్ (DFS) అధికారి తెలిపిన వివరాల ప్రకారం, మధ్యాహ్నం 3.35 గంటలకు కాల్ వచ్చింది. ఇందులో యవకుడు నిప్పంటించుకున్నట్టు చెప్పారు.
ఇది కూడా చదవండి: Vishwak Sen: విశ్వక్ సేన్ లైలా ఫస్ట్ లుక్ వచ్చేసింది!
Parliament: దీనిపై ఘటనా స్థలానికి వాహనాన్ని పంపించారు. రైల్వే బిల్డింగ్ సెక్యూరిటీ సిబ్బంది, ఇతర వ్యక్తులు కలిసి యువకుడి మంటలను దుప్పటితో ఆర్పివేశారని, ఆ తర్వాత అతన్ని రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రిలో చేర్చారు. ఆ యువకుడి పేరు జితేంద్ర అని, అతను యుపిలోని బాగ్‌పత్ నివాసి అని పోలీసులు తెలిపారు. ఘటనా స్థలం నుంచి 2 పేజీల సగం కాలిన సూసైడ్ నోట్, పెట్రోల్, కాలిపోయిన బ్యాగ్, షూ లభ్యమయ్యాయి. యువకుడు నిప్పంటించుకున్న ప్రదేశంలో బారికేడింగ్ ఏర్పాటు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఇంట్లో గొడవల కారణంగా జితేంద్ర ఆత్మహత్యకు ప్రయత్నించినట్టు తెలుస్తోంది.