Telangana: మణప్పురం గోల్డ్ లోన్ మేనేజర్ అరెస్ట్ కస్టమర్ల బంగారం భద్రం అని స్పష్టం చేసిన జిల్లా ఎస్పీ ఫేక్ కస్టమర్ ఐడి లను సృష్టించి మనపురం సంస్థను బురిడీ కొట్టించిన మేనేజర్ విశాల్ నిందితున్ని బ్రాంచ్ మేనేజర్ విశాల్ A1 ను ఈ రోజు వికారాబాద్ పోలీసులు అరెస్ట్ చేసి 5 బంగారం ప్యాకెట్లు లోని 83గ్రాముల బంగారం, 10 లక్షల రూపాయల డబ్బులను రికవరీ చేయడం జరిగింది. బంగారానికి సంబంధించిన కేసు అవ్వడం వలన ఇట్టి కేసు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించడం జరిగింది. ఇట్టి కేసులో ఎలాంటి నిర్లక్ష్యం చేయకుండా ఫిర్యాదు రాగానే కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంబించడం జరిగింది నేరస్థునికి సహకరించిన వారిపైన , ఆడిట్ నిర్వహించిన వారిపైన , విజిలెన్స్ టీమ్, క్రికెట్ బెట్టింగ్ నిర్వహకులపైనా దర్యాప్తు కొనసాగడం జరుగుతుంది. అలాగే మునప్పరం లో గల కస్టమర్స్ యొక్క ఏ బంగారము దొంగలించ బడలేదు . మునప్పరం లో గల ఏ కస్టమర్ కూడా దిగులు చెందనవసరము లేదు అని K.నారాయణరెడ్డి తెలిపారు ఈ కేసును చేదించిన పోలీసు అధికారులకు రివార్డులు అందజేయడం జరుగుతుందన్నారు.