Spirit: ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందుతున్న ‘స్పిరిట్’ సినిమా మ్యూజిక్ సిట్టింగ్స్ ఎట్టకేలకు మొదలయ్యాయి. సినిమాను అధికారికంగా ప్రకటించిన మూడు సంవత్సరాల తర్వాత సినిమా వర్క్ మొదలు పెట్టారు. దీపావళి సందర్భంగా మ్యూజిక్ సిట్టింగ్ జరుగుతున్నట్లు సోషల్ మీడియాలో షేర్ చేశారు సందీప్ రెడ్డి. హర్షవర్ధన్ రామేశ్వర్ ఆద్వర్యంలో జరుగుతున్న మ్యూజిక్ సిట్టింగ్ దృశ్యాన్ని ప్రభాస్ ఫ్యాన్స్ వైరల్ చేస్తున్నారు. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించిన ‘అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, యానిమల్’ సినిమాలు మ్యూజికల్ గానూ ఆకట్టుకున్నాయి. హర్ష వర్ధన్ ఈ సినిమాల్లో చార్ట్ బస్టర్ ఆల్బమ్స్ ను అందించటమే కాదు అద్భుతమైన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా కంపోజ్ చేశాడు. పోలీస్ బ్యాక్ డ్రాప్ లో యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందే ఈ చిత్రంలో ప్రభాస్ తొలిసారి ఖాకీ యూనిఫామ్ వేయబోతున్నాడు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ను వచ్చే ఏడాది ఆరంభించి సినిమాను 2026లో విడుదల చేయనున్నారు. టీ సీరీస్ నిర్మిస్తున్న ఈ సినిమాలో నటించే నటీనటుల వివరాలతో పాటు పని చేసే ఇతర సాంకేతిక నిపుణుల గురించి త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు. మరి హ్యిట్రిక్ విజయాలతో ఊపు మీదున్న సందీప్ రెడ్డి ప్రభాస్ కి ఏ స్థాయి విజయాన్ని అందిస్తాడో చూడాలి.