Hyderabad: హైదరాబాద్ లోని చందానగర్ డ్రగ్స్ కేసు లో ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. ఫ్రెండ్ పార్టీకోసం వెళ్లిన వైద్యుడు షాక్ కు గురైన ఘటన సంచలనంగా మారింది. వైద్యుడి స్నేహితుడు కృష్ణ రాం అనే వ్యక్తి నగరంలో హార్డ్వేర్ షాప్ ఓనర్ గా పనిచేస్తున్నాడు. దీపావళి పండుగ సందర్భంగా కృష్ణ రాం స్నేహితులతో పార్టీ ఏర్పాటు చేశాడు. కృష్ణ రాం, తన స్నేహితులు వైద్యుడితో సహా మరో నలుగురు పార్టీకి వచ్చారు. గుల్ మోహరు కాలనీ హౌస్ నెంబర్ 56 లో పార్టీ ఏర్పాటు చేశాడు.
అయితే కృష్ణరాం ఇంటికి డాక్టర్ తో సహా అందరూ చేరుకున్నారు. కృష్ణ రాం బాత్రూం కి వెళ్లిన సమయంలో డాక్టర్ తన బ్యాగ్ చూసి నిర్ఘాంత పోయాడు. అందులో డ్రగ్స్ చూసి షాక్ తిన్నాడు. బాత్రూం నుంచి వచ్చిన కృష్ణ రాం తో వైద్యుడు డ్రగ్స్ ఎక్కడికి తీసుకుని వెళుతున్నావ్ అని అడగడంతో ఏపీకి తీసుకుని వెళుతున్నట్లు తెలిపారు. దీంతో కృష్ణ రాం అక్కడున్న స్నేహితులతో ఎంజాయ్ చేస్తుండగా వైద్యుడు వెంటనే తెలంగాణ నార్కోటిక్ ట్రక్స్ బ్యూరో అధికారులకు సమాచారం అందించాడు.
Hyderabad: ఆరు మంది కలిసి ఎండీఎంఏ డ్రగ్ తో పార్టీ జరుగుతున్నట్లు సమాచారం రావడంతో నార్కోటిక్ అధికారులు దాడిచేశారు. కృష్ణారామ్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకోని చందానగర్ పోలీసులకు అప్పగించారు. నిందితుడిది రాజస్తాన్ లోని బగోడ తాలుకా జలోరి జిల్లాకు చెందిన కృష్ణారామ్ రాజస్థాన్ నుండి డ్రగ్స్ తెచ్చి నగరంలో విక్రయిస్తున్నట్లు గుర్తించారు. ఘటన స్థలంలో 18 లక్షల విలువ చేసే 150 గ్రాముల MDMA డ్రగ్స్ ను సీజ్ చేశారు. కేసు నమోదు చేసుకొని చందానగర్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
మరో ఐదుమంది కోసం పోలీసులు గాలిస్తున్నారు. అయితే ముందు డాక్టర్ ఇంట్లోనే పార్టీ నిర్వహిస్తున్నాట్లు వచ్చిన కథనాలపై వైద్యుడు స్పందించాడు. తన స్నేహితుడి ఇంట్లో పార్టీ ఉండగా తనే అక్కడి వెళ్ళానని, అక్కడ తన స్నేహితుడి బ్యాగ్ లో డ్రగ్స్ చూసి పోలీసులకు సమాచారం ఇచ్చానని తెలిపాడు. కానీ.. కథనాలు మాత్రం వైద్యుడి పేరుతో వచ్చాయని తెలిపాడు. పోలీసులకు తనే సమాచారం ఇచ్చానని వెల్లడించారు. సరైన సమాచారం లేకుండా ఎలా ప్రచురిస్తారని వైద్యుడు మండిపడ్డారు.