Vijayawada: వైద్యుల నిర్లక్ష్యంగా ఓ వ్యక్తి మృతి చెందాడంటూ అతని బంధువులు వైద్యశాల వద్ద ఆందోళనకు దిగిన ఘటన విజయవాడ రూరల్ మండలం ఎనికేపాడులో చోటుచేసుకుంది. ఆగిరిపల్లి మండలం వడ్లమానుకు చెందిన రెడ్డి వెంకటేశ్వరరావు బాపులపాడు మల్లవల్లిలో లైన్‌మెన్‌గా విధులు నిర్వహిస్తున్నారు. గత నెలలో హనుమాన్ జంక్షన్ సమీపంలో జరిగిన ప్రమాదంలో వెంకటేశ్వరరావు తలకు తీవ్రగాయాలు కావడంతో ఎనికేపాడులోని ఓ ఆస్పత్రిలో చేర్పించారు.
ఇది కూడా చదవండి: KTR: కేటీఆర్ అరెస్ట్ అయితే బీఆర్ఎస్ పగ్గాలు ఎవరికి
Vijayawada: అక్కడ చికిత్స పొందుతున్న రెడ్డి వెంకటేశ్వరరావు కు వైద్య సిబ్బంది ఓ ఇంజెక్షన్‌కు మరో ఇంజెక్షన్ ఇవ్వడంతో అతని ప్రాణాలు పోయాయని మృతుని బంధువులు ఆరోపించారు. వెంకటేశ్వరరావును చూడాలని కోరగా.. ఆయన ఉన్న గదికి తాళాలు వేసిన వైద్య సిబ్బంది, మిగతా బ్యాలెన్స్ డబ్బులు చెల్లిస్తే అనుమతించమని దౌర్జన్యం చేశారని వారు వాపోయారు.
Vijayawada: వైద్యం వికటించినందునే వెంకటేశ్వరరావు మృతి చెందాడని ఆరోపిస్తూ మృతుడి బంధువులు ఆస్పత్రి ఎదుట బైఠాయించి ఆందోళన చేశారు. ఈ ఘటనపై ప్రభుత్వం విచారణ జరిపి మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.