Kadapa: జగన్ సొంత జిల్లాలో టీడీపీ, వైసీపీ మధ్య కుర్చీ వార్ ఏపీ రాజకీయాల్లో కాక రేపుతోంది.గత 20 సంవత్సరాలుగా కడప కార్పోరేషన్‌ను ఏలుతున్న జగన్ అసమ్మదీయులకు ఎమ్మెల్యే మాధవి రెడ్డి చుక్కలు చూపిస్తున్నారు.2005లో మేజర్ మున్సిపాలిటీ నుంచి కార్పోరేషన్‌గా అప్ గ్రేడ్ అయ్యాక ముందు కాంగ్రెస్ తర్వాత వైసీపీ నుంచి మేయర్ పదవి కొనసాగుతుంది.2024లో సొంత జిల్లాలో జగన్ షాక్ ఇచ్చిన కడప ప్రజలు మరోసారి కార్పోరేషన్‌లో ఇష్టానుసారంగా ఏలుతున్న వైసీపీకి కూటమి ప్రభుత్వం చెక్ పెట్టింది.
Kadapa: జగన్‌పై అసంతృప్తితో కార్పోరేటర్ల టీడీపీలో చేరడంతో కడప వైసీపీకి ఎదురుదెబ్బ తగిలింది.గత ప్రభుత్వంలో కడప అభివృద్ధి పక్కన పెట్టి కేవలం దోచుకోవడమే లక్ష్యంగా పని చేసిన మేయర్ కొద్ది మంది కార్పోరేటర్లకు చెక్ పెట్టేలా ఎమ్మెల్యే మాధవి రెడ్డి సర్వసభ్య సమావేశంలో ప్రశ్నల వర్షం కురిపించడంతో డిఫెన్స్ పడ్డ వైసీపీ కొత్త రాజకీయానికి తెర లేపింది. కడప ఎమ్మెల్యే మాధవి రెడ్డికి వేదిక పైన కుర్చీ లేకుండా చేసి అడ్డుకోవాలని చూడడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
ఇది కూడా చదవండి: Vijayawada: విజయవాడ లో వైద్యం వికటించి వ్యక్తి మృతి.
Kadapa: గత వైసీపీ ప్రభుత్వంలో నిర్వహించిన కార్పోరేషన్ సర్వసభ్య సమావేశంలో అప్పటి కడప ఎమ్మెల్యే అంజాద్ బాషా, కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డిలకు వేదికపైన కుర్చీలు ఏర్పాటు చేశారు. గత ఐదేళ్ళు కొనసాగించిన సాంప్రదాయం పక్కన పెట్టి ఇప్పుడు కూటమి ఎమ్మెల్యేలకు మాత్రం వేదికపై సీటు నిరాకరించడంపై ఇప్పుడు కొత్త చర్చకు దారి తీసింది. టీడీపీ ఎమ్మెల్యే అనే కారణంగా వైసీపీ కుట్ర రాజకీయాలు చేస్తోందని కూటమి ప్రభుత్వం వాదిస్తోంది.
Kadapa: గత సమావేశంలోను ఎమ్మెల్యే మాధవి రెడ్డి ప్రశ్నించారు. గతంలో టీడీపీ కార్పోరేటర్ల బలం లేకపోవడంతో ఒంటరిగా పోరాడిన మాధవి రెడ్డి ఇప్పుడు కార్పోరేటర్ల సంఖ్య పెరగడంతో తనదైన శైలిలో కార్పోరేషన్ పాలక వర్గంపై ఎదురు దాడికి దిగారు. కడప అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని గత ప్రభుత్వం అవినీతి అక్రమాలను వెలుగులోకి తెస్తామని అంటున్నారు.కడప కార్పోరేషన్‌లో ఉద్రిక్తత వాతావరణం మధ్య సమావేశం రసాభాసగా కొనసాగినప్పటికీ ఎమ్మెల్యే మాధవి రెడ్డి మాత్రం నిలబడే నిరసన వ్యక్తం చేశారు. మేయర్ సురేష్ బాబు వైసీపీ కార్పోరేటర్లు మాత్రం సమావేశంలో అజెండా చర్చ జరగకుండానే 50 పనులకు బిల్లులు మంజూరు చేస్తూ ఆమోదం చేసుకోవడంపై ఎమ్మెల్యే మాధవి రెడ్డి మండిపడ్డారు. చర్చ జరగకుండా బిల్లులు ఆమోదం చేయడంపై విచారణ చేయాల్సిందే అనే వాదన వైసీపీ నుంచి కూడా వినిపించడం కొత్త చర్చకు దారి తీస్తుంది.మరి కడప కార్పొరేషన్ కుర్చీలాట ఎలాంటి మలుపు తిరుగుతోంది వేచి చూడాల్సిందే.