Vijay Deverakonda: విజయ్ దేవరకొండ నటించిన తాజా చిత్రం ‘ఫ్యామిలీ స్టార్’ అతన్ని, అతని అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసింది. ఈ నేపథ్యంలో రాబోయే ప్రాజెక్ట్స్ మీదే వీరు ఆశలు పెట్టుకున్నారు. ప్రస్తుతం విజయ్ దేవరకొండ ‘జెర్సీ’ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఓ స్పై యాక్షన్ థ్రిల్లర్ మూవీని చేస్తున్నాడు. దీని షూటింగ్ జనవరి నెలాఖరుకు పూర్తవుతుంది. ఆ వెంటనే కొద్దిరోజులు గ్యాప్ తీసుకుని… ఫిబ్రవరిలో మరో సినిమాను విజయ్ దేవరకొండ పట్టాలెక్కిస్తాడట. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించే ఈ సినిమాకు రాహుల్ సాంకృత్యాన్ దర్శకుడు.
ఇది కూడా చదవండి: Poorna: పూర్ణ ప్రధాన పాత్రలో ‘డార్క్ నైట్
Vijay Deverakonda: విజయ్ దేవరకొండ, రాహుల్ కాంబోలో గతంలో ‘టాక్సీవాలా’ మూవీ వచ్చింది. ఇప్పుడీ తాజా మూవీని పీరియాడిక్ డ్రామాగా రూపొందిస్తున్నారు. 1854 -78 మధ్య రాయలసీమలో జరిగిన ఓ సంఘటన ఆధారంగా ఈ సినిమా రూపుదిద్దుకోబోతంది. ఇందులో యోధుడి పాత్రను పోషించబోతున్న విజయ్ దేవరకొండ అందుకోసం గుర్రపు స్వారీలో ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్నాడట. ఈ సినిమా మరోసారి విజయ్ దేవరకొండ సరసన రశ్మిక మందణ్ణ నాయికగా నటించబోతోంది.